మారుతి దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రతి రోజూ పండగే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. డిసెంబరు 20 వ తేదీన రిలిజైన ఈ చిత్రం ఆ రోజు విడుదల అయిన అన్ని చిత్రాలకి గట్టి పోటీనిచ్చి రేసులో ముందంజలోకి వచ్చేసింది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం దుమ్ము దులుపుతుంది. మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంపై విడుదలకి  ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. 

 

పూర్తి పాజిటివ్ బజ్ తో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దాదాపు 800 స్క్రీన్స్‌‌లో విడుదలైంది. తొలిరోజు దాదాపు 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ప్రతిరోజూ పండగే రెండో రోజు నుంచి కూడా అదే దూకుడు చూపించింది. శతమానం భవతి లాంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం శతమానం భవతి లాగే మంచి హిట్ దిశగా పరుగులు పెడుతోంది.

 

ఈ చిత్రం వారం రోజుల్లోనే 20 కోట్ల షేర్ అందుకుని సాయి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ వైపు అడుగులు వేస్తుంది. విడుదలైన ఏడో రోజు కూడా దాదాపు కోటి వరకు షేర్ తీసుకొచ్చింది. ఈ వారం సినిమాలేవీ లేకపోవడంతో కొత్త ఏడాది వరకు కుమ్మేసుకోనున్నాడు సాయి ధరమ్ తేజ్. ముఖ్యంగా ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర అందరినీ ఆకర్షించింది. సినిమా మొత్తంలో ఈ పాత్రే హైలైట్ గా నిలిచింది. ఒక దశలో ఈ సినిమాకి హీరో సాయి తేజ్ కాదేమో అన్న అనుమానం కలుగక మానదు.

 

అంత బాగా రావు రమేష్ పాత్రని తీర్చిదిద్దాడు మారుతి. ప్రతి రోజూ పండగే అంటూ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకి పండగ లాంటి అభిప్రాయాన్ని కలిగించడంతో పాటు నిర్మాతలకి పండగ చేసుకునే కలెక్షన్లని రాబడుతోంది. ముందు ముందు సంక్రాంతి వరకు కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సూపర్ హిట్ ఖాయమనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: