సినిమా ఆడాలంటే పెయిర్ బాగుండాలి.. షో హిట్ అవ్వాలంటే కూడా ఆ జోడీ కుదరాలి. అయితే ఒకరు కంటెస్టంట్ ఒకరు యాంకర్ అయినా కూడా వాళ్లిద్దరికి జోడీ కుదిరింది. ఇప్పుడా అప్పుడా దాదాపు ఐదారేళ్లుగా వాళ్లని కలిపి వస్తున్న వార్తలు కోకొల్లలు. షోలో భాగంగా అతను ఆమెకు లవ్ ప్రపోజ్ చేయడం 

 

ఇంతకీ ఎవరిద్దరి గురించి ఈ మ్యాటర్ అని అనుకుంటున్నారా.. ఇంకెవరు సుడిగాలి సుధీర్, రష్మిల గురించే.. జబర్దస్త్ షోతో సుధీర్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా అదే షోతో యాంకర్ గా అదరగొడుతుంది. జబర్దస్త్ షోతో వచ్చిన ఫాలోయింగ్ తో రష్మి సినిమాల్లో కూడా ఛాన్సులు పట్టేస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై తన అందాలతో అలరిస్తున్న రష్మి అక్కడ కూడా క్లిక్ అయ్యింది.

 

అయితే జబర్దస్త్ నుండి వీళ్లు ఢీ షోకి ప్రమోట్ అయ్యారు. అక్కడ కూడా సుధీర్ రష్మికి ప్రపోజ్ చేయడం ఆమె కాదనడం రొటీనే.. షోలో భాగంగా రష్మి లేకపోతే నేను లేను అంటూ డైలాగులు చెప్పే సుధీర్ బయటకు వస్తే మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమి లేదు రష్మి నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటూ చెప్పుకొస్తాడు.

 

సుధీర్, రష్మిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ క్లిక్ అవగా నిజంగా వారిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకునే వారు లేకపోలేదు. రీసెంట్ గా ఢీ చాంపియన్స్ లో రష్మి మీద తమ ప్రేమని వ్యక్తం చేశాడు సుధీర్.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తనని విడిచిపెట్టేది లేదని అన్నాడు. రష్మి కూడా జీవితంలో ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా సరే నన్ను అడగమని చెప్పింది. మొత్తానికి సుధీర్ రష్మి అలా పైకి ఏమి లేదన్నట్టు ప్రవర్తించడం చూసి జనాలను వీళ్ళు పిచ్చోళ్ళు చేస్తున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి,

మరింత సమాచారం తెలుసుకోండి: