తెలుగు చిత్ర పరిశ్రమలో మన్మథుడు గా పేరు తెచ్చుకున్న హీరో అక్కినేని నాగార్జున..ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఆయన మొన్న వచ్చిన మన్మథుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.. సినిమా భారీ డిజాస్టర్ కావడంతో సినిమాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తున్న నాగ్ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. కొత్త లుక్ తో ప్రేక్షులముందుకు వస్తున్నాడు..


ఇకపోతే టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు ‘గగనం’, ‘ఊపిరి’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేశారాయన. ఇప్పుడు అలాంటి మరో సినిమాతో వస్తున్నారు కింగ్. ఆ సినిమాలో నటిస్తున్న వారంతా కొత్త వారని సమాచారం.. సినిమా కథ నచ్చడంతో ఈ సినిమా నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం..


నాగార్జున టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. అంతా కొత్తవాళ్లతో ఈ సినిమా చేస్తున్నట్టు నాగార్జున ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా మేకింగ్ కూడా కొత్తగా ఉంటుందని అన్నారు.


ఇది ఇలా ఉండగా డిఫ‌రెంట్‌గా ఉన్న నాగార్జున లుక్ రీసెంట్‌గా జ‌రిగిన దిశ హంత‌కుల‌ ఎన్‌కౌంట‌ర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారని ఫ‌స్ట్ లుక్‌లోని న్యూస్ పేప‌ర్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన నాగ్ ఈ సినిమా కూడా అనుకున్న హిట్ నో ఇవ్వలేక  పోయాయి.. మరి ఈ సినిమా అన్న హిట్ అవుతుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: