సినిమాల్లో కొందరు హీరోలకి కొన్ని పాత్రలు విజయాలని తెస్తుంటాయి. అలా ఎన్ని సార్లు ఆ పాత్రలు చేసినా జనాలు చూస్తుంటారు. ఆ పాత్ర ద్వారానే జనాల్లో ఆ హీరోకి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఆ హీరో చేసే తర్వాతి సినిమాలోనూ అలాంటి పాత్రలే కోరుకుంటారు. అదే కొన్ని సార్లు కొందరు హీరోలకి కొన్ని పాత్రలు అస్సలు నప్పవు. ఎన్ని సార్లు ఆ పాత్రలు వేసినా విఫల అవుతుంటాయి. అలాంటి పాత్రల్లో పోలీస్ పాత్ర ఒకటి.

 

ఇండస్ట్రీలో కొందరు హీరోలకే పోలీస్ పాత్రలు సూటవుతాయి. సూటవడం అనే కంటే విజయాలని తెచ్చి పెడతాయని చెప్పడం కరెక్టేమో! అలా పోలీస్ పాత్రలు చేసినా విజయాలు అందుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నాగార్జున కూడా ఒకరు. అయితే నాగార్జున చేసిన పోలీస్ పాత్రలు చాలా తక్కువ. ఆయన చేసిన శివమణి సినిమాలో పోలీస్ పాత్ర మినహా మిగతా సినిమాలేవీ ప్రేక్షకులని ఆకట్టుకోలేదనే చెప్పాలి.

 

శివమణి సినిమాలోనూ పోలీస్ కంటే అందులో ఉన్న లవ్ స్టోరీ జనాలకి ఎక్కువ కనెక్ట్ అయ్యింది. ఆ లవ్ స్టోరీలో ఉన్న ఇంటెన్సిటీ జనాలని విపరీతంగా ఆకర్షించింది. ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ అనే ఓ మూవీ చేయగా అది ఘోరంగా విఫలమైంది. అంతకుముందు ఆవిడా మా ఆవిడే మూవీ కూడా ఫలితం ఇవ్వలేదు. అయినప్పటికీ మరో మారు నాగార్జున ఎన్ ఐ ఏ అధికారిగా వైల్డ్ డాగ్ మూవీ తో సాహసం చేస్తున్నారు.

 

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల అయింది. మరి ఈసారైనా నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో సూపర్ హిట్ అందుకుంటారేమో చూడాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాట్నీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు అహీతోష్ సోలొమన్ ఈ చిత్రాన్ని తెరపైకెక్కిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి లు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: