కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. వరుస స్టార్ ఛాన్సులతో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్ టైం లో కూడా ఫుల్ కోపరేట్ చేస్తుందట. ఏదైనా సినిమా షూటింగ్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటే మరో రెండు రోజులకు కూడా సరిపోయే డ్రెస్సులతో వెళ్తానని అంటుంది. మూడు రోజులు షూటింగ్ ఉన్నా సరే వారం రోజులకు సరిపడే డ్రెస్సులను సూట్ కేస్ లో ఉంటాయట.

 

అంతేకాదు ఎప్పుడూ తన ఇంట్లో ఓ సూట్ కేస్ రెడీగా ఉంటుందని అంటుంది రష్మిక. ఇక తను చేసే సినిమాల్లో తన ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటుంది అమ్మడు. తన పోర్షన్ ఏదో తను చేసి రాకుండా సినిమా కథ హీరో క్యారక్టర్ గురించి తెలుసుకుంటుందట. అంతేకాదు తను చేసిన సినిమాల ఫలితాల గురించి ఆరా తీస్తుందట.

 

సినిమా చేశామా వచ్చామా అన్నట్టు కాకుండా తను చేసే ప్రతి సినిమా సొంత సినిమాగా ఫీల్ అవుతానని.. సినిమానే ఎప్పుడూ తన ద్యాస అని అంటుంది రష్మిక. అంత డెడికేషన్ ఉంది కాబట్టే అమ్మడు సూపర్ క్లిక్ అయ్యింది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తెలుగులో మాత్రం వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటుంది.

 

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తో జత కట్టిన రష్మిక ఓ పక్క నితిన్ భీష్మలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటుగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు ఆమెను తీసుకున్నారట మొత్తానికి రష్మిక తెలుగులో టాప్ ప్లేస్ సంపాదించేలా ఉంది. తెలుగులోనే కాదు తమిళ కన్నడ భాషల్లో కూడా రష్మిక కెరియర్ సూపర్ జోష్ లో ఉంది. మాతృభాష కన్నడలో సినిమాలు చేస్తున్న రష్మిక తమిళంలో కార్తి సినిమాలో నటిస్తుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: