నాగార్జున మన్మధుడు 2 దారుణంగా ఫెయిల్ అయ్యింది.  ఈ సినిమా తరువాత నాగ్ సినిమాల గురించిన న్యూస్ బయటకు రాలేదు.  బంగార్రాజు చేస్తారని, మరో సినిమా చేస్తారని ఇలా రకరకాల సినిమాల పేర్లు బయటకు వచ్చాయి.  కానీ, అందరికి షాక్ ఇస్తూ వైల్డ్ డాగ్ పేరుతో సినిమా చేస్తున్నారు.  ఎన్ కౌంటర్ స్పెసలిస్ట్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు.  


కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.  గతంలో నాగార్జున గగనం సినిమా చేశారు.  ఇండియన్ ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో వచ్చిన సినిమా అది.  అప్పట్లో నేపాల్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంను తాలిబన్లు హైజాక్ చేసి, ఉగ్రవాది మసూద్ ను విడిపించుకున్నారు.  ఇది అప్పట్లో సంచనలంగా మారింది.  ఈ కథనం ఆధారంగా నాగార్జున గగనం సినిమా వచ్చింది.  


సినిమా మంచి విజయం సాధించింది.  సినిమా నిర్మాణం ఎంత సైలెంట్ గా జరిగిందో... సినిమా కూడా ఆంతే సైలెంట్ గా విజయం సాధించింది.  ఈ విజయంతో నాగార్జున మరోసారి తన స్టామినా నిరూపించుకున్నాడు.  ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఇలాంటి సినిమాలు రావాలని, అనేకమంది పొగడ్తలతో ముంచెత్తారు.  


కాగా, ఇప్పుడు మరోసారి అలాంటి కథనంతోనే సినిమా తీస్తున్నాడు నాగ్.  ఈ సినిమా రియల్ సంఘటన ఆధారంగా కొంత కల్పనను చేర్చి ఫిక్షన్ గా తీస్తున్నారు.  దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.  ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.  మజిలీ, వెంకిమామ రెండు సినిమాలు మంచి విజయం సొంతం చేసుకున్నారు.  ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.  వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: