ప్రతి ఒక్కరు సినిమా హీరో అవ్వాలని కలలు కంటారు కాని ఆ కలని నిజం చేసుకున్న వాడే నిజమైన హీరో. ఈరోజు రిలీజైన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ప్రమోట్ అయ్యాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ తన కామెడీ టైమింగ్ తో అలరిస్తూ వచ్చాడు. ఆరేళ్లుగా జబర్దస్త్ లో క్రేజీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ ఆ తర్వాత వేరే షోలు చేస్తూ మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు.

 

బుల్లితెర నుండి వెండితెర మీదకు ప్రమోట్ అయిన సుధీర్ హీరో పక్కన సైడ్ క్యారక్టర్స్ వేస్తూ వచ్చాడు. అయితే లేటెస్ట్ గా సాఫ్ట్ వేర్ సుధీర్ తో సోలో హీరోగా ప్రమోట్ అయ్యాడు. సుధీర్ లోని టాలెంట్ చూసి అతన్ని హీరోగా చేయాలని వచ్చారు దర్శక నిర్మాతలు రాజశేఖర్ రెడ్డి, శేఖర్ రాజు. ఈ సినిమాలో సుధీర్ కు జోడీగా ధన్యా బాలకృష్ణ నటించారు.

 

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ ఎలా ఉన్నా సుధీర్ ఈ సినిమాతో తన కామెడీ, డ్యాన్స్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని విభాగాల్లో టాలెంట్ చూపించాడని అంటున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా అనిపించినా సుధీర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని తెలుస్తుంది. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. వారి మీద నమ్మకంతోనే సుధీర్ ఈ సినిమా చేశాడు.

 

సినిమా ప్రమోషన్స్ కోసం కూడా జబర్దస్త్ టీం ను.. ఢీ టీం ను వాడుకున్నాడు సుడిగాలి సుధీర్. మరి సుధీర్ తొలిప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యిందో సాయంత్రం వరకు తెలుస్తుంది. ఇన్నాళ్లు వెండితెర మీద చిన్న చిన్న పాత్రలతో అలరించిన సుధీర్ వెండితెర మీద ఇలానే హీరోగా మరెన్నో సినిమాలు చేసి అలరించాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: