ఈ మధ్యకాలంలో రియాలిటీ సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఏదైనా ఒక ఘటన జరిగింది అంటే చాలు ఆ ఘటనలు సినిమాలలో కనిపించేస్తాయి. మొన్న ఈ మధ్య వెంకీ మామ సినిమాలో నాగ చైతన్య విన్యాసం కనిపించింది. అదే ఈ సంవత్సరం ప్రజలను ఎంతో బాధ పెట్టిన ఘటన.. దేశం విలువ తెలిసేలా చేసిన ఘటన అభినందన్ ఘటన. 

 

సినిమాకు ఘటనకు సంబంధం లేకుండా తీసి.. ఎమోషనల్ సీన్ ని ప్రజలు నవ్వుకునేలా చిత్రీకరించారు. ఇలా దేశ ప్రజలను ఎమోషనల్ గా కనెక్ట్ చేసిన ఘటనలను కామెడీ సీన్స్ చేస్తున్నారు. అన్ని కామెడీ అని చెప్పలేం.. కొన్ని మాత్రం నిజంగా ఎమోషనల్ కంటే సినిమాలోనే ఇంకా ఎక్కువ ఏమోషన్స్ ఉంటాయి. 

 

ఈ నేపథ్యంలోనే దేశాన్ని శోకసంద్రంలో ముంచేసిన దిశ ఘటనను సినిమా తియ్యాలని చాలామంది అనుకుంటున్నారు. సమంత దిశ పాత్రలో నటిస్తుంది అని కూడా గాసిప్ వచ్చింది. అది ఎంతవరుకు నిజమో తెలీదు కానీ.. అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

 

ఇటీవలే మన్మథుడు-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచిన నాగార్జున ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాల్మన్ అనే కొత్త దర్శకుడి ఈ సినిమాతో అవకాశం కల్పించారు నాగార్జున. ఈ చిత్రం యాక్షన్ చిత్రమని నాగ్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. 

 

అయితే ఈ 'వైల్డ్ డాగ్' చిత్రంలో నాగ్ పాత్ర పేరు విజయ్ వర్మ. ఇది ఓ ఎన్ఐఏ అధికారి కథ. ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే.. అతను ఎన్కౌంటర్ చేసినట్టు అక్కడ ఆరు మంది మృతి చెందినట్టు 'ఈరోజు' అనే దినపత్రిక రాసినట్టు చూపారు. 

 

అయితే అదేంటో ఆ 'ఈరోజు' దినపత్రిక సేమ్ టూ సేమ్ ప్రముఖ పత్రిక 'ఈనాడు' పత్రిక కాఫీలా ఉంది. ఎన్కౌంటర్ అంటే ఇంకా నిజమైన ఘటనను కాపీ చేసినట్టే ఉందిలెండి.. కానీ పత్రిక కూడా సేమ్ టూ సేమ్ దించేస్తే ఎలాగండి ? అని అంటున్నారు నెటిజన్లు. ఒక్క ఈనాడు ఏ కాదు.. ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక 'టైమ్స్ అఫ్ ఇండియా'ను కూడా 'న్యూస్ అఫ్ ఇండియా' చేసేశారు. దీంతో ప్రస్తుతం ఈ పత్రికల పేర్లు వైరల్ గా మారాయి.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: