టాలీవుడ్ లో ఇప్పుడు మాలీవుడ్ భామల సందడి మొదలైంది.  ఇప్పటికే నయనతార,సమంత మరికొంత మంది నటీమణులు స్టార్ హీరోయిన్ల హోదాలో వెలిగిపోతున్నారు.  ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన పున్నమినాగు మూవీలో ఒక సన్నివేశంలో నటించిన మోహని కూతురు కీర్తి సురేష్ ‘నేను శైలజ’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఈమె తండ్రి మాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత  సురేష్ కుమార్. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి తర్వాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం ‘గీతాంజలి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు.  

 

తెలుగు లో రామ్ నటించిన నేను శైలజ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ మూవీతో మంచి విజయం అందుకుంది.  ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ‘మహానటి’ మూవీలో నటించింది.  ఈ మూవీలో నిజంగా సావిత్ర మన కంటి ముందుకు వచ్చి నటించిందా అన్నంతగా ఆ పాత్రలో లీనమైపోయింది.  విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  గ్లామర్ గా కనిపించి మురిపించిన కీర్తి సురేష్.. మహానటి సావిత్రి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి మెప్పించింది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన ఆమె... ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మహానటి మూవీకి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

'మహానటి' సినిమాను వద్దనుకున్నానని కీర్తి సురేశ్ తెలిపింది. మహానటి సావిత్రి పాత్రకు తాను న్యాయం చేయగలనా.. అంత గొప్ప నటి పాత్ర మెప్పించగలనా అన్న అనుమానం వచ్చిందని అన్నారు. అయితే తన మామయ్య గోవింద్ తనను ఒప్పించారని చెప్పింది. సావిత్రి పాత్రను తాను బాగా పోషించగలననే నమ్మకం మామయ్యకు ఉందని తెలిపింది. అయితే నాగ్ అశ్విన్ సైతం  సావిత్రి పాత్రలో తనను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేకపోతున్నానని అన్నారని తెలిపింది. చివరకు ఈ మూవీలో నటించానని... తన మీద నమ్మకం ఉంచిన నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అంది.

మరింత సమాచారం తెలుసుకోండి: