సెలబ్రిటీలు తాగితే ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కాదు. చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి మీడియా ముందు తమ పరువు పోగొట్టుకుంటారు. అయితే ఈ విధంగానే బెంగళూరులో జరిగిన ఓ మందు పార్టీలో స్టార్ హోటల్లో స్యాండిల్ వుడ్ హీరోయిన్ సంజన మరియు బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈనెల 24వ తారీఖున బెంగళూరు నగరంలో స్టార్ హోటల్లో మందు పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మందు పార్టీ కి చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇటువంటి తరుణంలో ఈ వేడుకకు బాలీవుడ్ నిర్మాత వందనా జైన్, స్యాండిల్ వుడ్ ప్రముఖ నటి సంజనా సైతం ఇదే పార్టీకి హాజరైనారు.

 

అంతేకాకుండా ఆ రాత్రి పబ్ లోని ఒకే టేబుల్ లో ఇద్దరు కూర్చోవటం జరిగింది. అయితే ఓ చిన్న విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగటంతో పార్టీ మధ్యలో ఇద్దరూ ఒకేసారి గొడవకు దిగి మాట మాట అనుకోవటం జరిగింది అయితే పక్కనున్న కొంతమంది వారించినా కొంతసేపు తగ్గిన గొడవ మళ్లీ ఒకేసారి పెరిగి ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లి పోయింది. దీంతో అప్పటికే తప్పతాగిన ఇద్దరు  మద్యం మత్తులో ఉన్న నటి సంజనా ఆమె చేతిలో విస్కీ గ్లాస్, విస్కీ బాటిల్ తీసుని వందనా జైన్ మందు బాటిల్లతో ప్రొడ్యూసర్ ముఖం పచ్చడయ్యేలా దాడి చేసిందని సమాచారం.

 

సంజనా, వందనా జైన్ రచ్చరచ్చ చెయ్యడంతో అక్కడ ఉన్న వారు వెంటనే విడదీశారు. అయితే గొడవ మొత్తం జరిగిన తర్వాత టాలీవుడ్ నిర్మాత వందనా జైన్ నేరుగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ చేరుకుని నటి సంజనా మీద ఫిర్యాదు చేశారు. విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో నటి సంజనా మీద బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ దృవీకరించారు. అయితే తాను కొట్టింది వాస్తవమేనని సంజన ఒప్పుకొంది. తన తల్లిని మరియు తన చేతిని ప్రొడ్యూసర్ వందనా జైన్ పూర్తిగా వెనక్కు తిప్పడంతో నొప్పి కలిగిందని, ఆ సమయంలో వందనా మీద తాను చెయ్యి చేసుకోవలసి వచ్చిందని సంజనా అంటోంది. దీంతో ఈ వార్త ఇప్పుడు శాండిల్ వుడ్ లో వైరల్ వార్త గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: