‘మన్మధుడు 2’ ఫెయిల్యూర్ తో నాగార్జున షాక్ కు గురి అవ్వడంతో పాటు అతడి వయసుకు తగ్గ పాత్రలు చేయమని చాలామంది సలహాలు కూడ ఇచ్చారు. దీనితో కన్ఫ్యూజన్ కు గురైన నాగార్జున తాను ఎలాంటి సినిమాలలో నటిస్తే హిట్ వస్తుందో తెలియక చాల తికమక పడ్డాడు. ఇలాంటి పరిస్థితులలో నాగార్జునకు అనేక సార్లు కలిసి వచ్చిన పోలీసు పాత్రను నమ్ముకుని నాగ్ మళ్ళీ పోలీస్ అవతారంలో వైల్డ్ డాగ్ అనే వైవిధ్యమైన టైటిల్ తో ఒక సినిమాను చేస్తున్నాడు. 

ఇప్పటికే ప్రారంభం అయిన ఈమూవీ షూటింగ్ చాల వేగంగా ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీలో నాగార్జున విజయవర్మ అనే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ మూవీలో పోలీసు పాత్రలో నటించి చేతులు కాల్చుకున్న నాగార్జునకు ఇంకా ఈ పోలీసు పాత్ర పై మోజు పోలేదా అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఒక యంగ్ డైరెక్టర్ ను నమ్ముకుని నాగార్జున చేస్తున్న ఈ సాహసం ఎంతవరకు విజయవంతం అవుతుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ తో సినిమాలు రావడం కొత్తది కాకపోయినా మరీ వెరైటీగా కనిపిస్తున్న ఈ డిఫరెంట్ టైటిల్ ను మాస్ ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న సందేహాలు చాలామంది వ్యక్త పరుస్తున్నారు. 

తనకు 60 సంవత్సరాలు దాటిపోయినా తనకు 70 ఏళ్ళు వచ్చేదాకా సినిమాలు చేస్తూనే ఉంటాను అని ఇప్పటికే అనేక సార్లు చెప్పిన నాగార్జున మితిమీరిన నమ్మకాన్ని ఈ ‘వైల్డ్ డాగ్’ నిజం చేయలేకపోతే భవిష్యత్ లో నాగార్జున నటించే సినిమాల మార్కెట్ విపరీతంగా పడిపోవడమే కాకుండా అతడి సినిమాలను కొనడానికి బయ్యర్లు కూడ భయపడిపోతారు. దీనితో నాగ్ కెరియర్ కు ఈ మూవీ విజయం చాల కీలకంగా మారడంతో ఈ మూవీ కోసం నాగార్జున చాల కష్టపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: