టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం వరుసగా విజయాలతో పాటు ఆఫర్లు కూడా దక్కించుకుంటూ గోల్డెన్ లెగ్ భామ అనే పేరుతో దూసుకుపోతున్న పూజ హెగ్డే, కెరీర్ మొదట్లో మాత్రం చాలా వరకు ఫ్లాప్స్ ని చవి చూసింది. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ, ఆ తరువాత వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద లో కూడా నటించింది. అయితే అవి రెండు కూడా ఆమెకు సక్సెస్ ని అందివ్వ లేదు. ఆ తరువాత బాలీవుడ్ అందాల నటుడు హృతిక్ రోషన్ సరసన మోహేన్జెదారో సినిమాలో నటించిన పూజ, 

 

ఆ సినిమాతో కూడా మరొక ఫ్లాప్ ని చవి చూసింది. ఇక గత ఏడాది ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత హిట్ తో ఫస్ట్ టైం పెద్ద విజయాన్ని అందుకున్న పూజ, ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో నటించిన మహర్షి, అలానే సెకండ్ టైం వరుణ్ తేజ్ తో నటించిన గద్దలకొండ గణేష్ తో ఇంకో విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో, ప్రభాస్ తో జాన్, అలానే అఖిల్ 4వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే నిన్న ఒక ఆంగ్ల పత్రికతో తన సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకున్న పూజా

 

కెరీర్ లో హృతిక్ తో కలిసి నటించిన మోహెన్జేదారో సినిమాలో తొలిసారిగా లిప్ లాక్ సీన్లో నటించానని, దర్శకుడు తనకు సీన్ వివరించినపుడు బాగానే అనిపించినా, షూటింగ్ సమయంలో ఎదురుగా ఎంతో మంది ఉండగా, ఆలా హృతిక్ ని కిస్ చేయడం కొంత ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది. నిజానికి అటువంటి సీన్స్ స్క్రీన్ పై ప్రేక్షకులు చూడడానికి ఎంతో అందంగా ఉన్నా, అలంటి సీన్స్ చేయడానికి నటులు లోలోపల ఎంతో బాధ పడతారని అంటోంది పూజా. ఇక ఆమె, బన్నీతో కలిసి నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: