పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది తన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన రాజకీయ జీవితంలో నిమగ్నం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తరపున భీమవరం, గాజువాక ప్రాంతాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్, అనూహ్యంగా రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇక అక్కడి నుండి పార్టీ కార్యకలాపాల పై మరింతగా దృష్టి పెట్టిన పవన్, అంతకముందు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడం, 

 

అలానే అప్పటి నుండి ఫ్యాన్స్ కూడా తన నుండి ఒక మంచి సినిమా ఆశిస్తుండడంతో, ఇటీవల తదుపరి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీ లో అమితాబ్ బచ్చన్ హీరోగా ఇటీవల రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న పింక్ సినిమా రీమేక్ లో నటించనున్న పవన్, అతి త్వరలో ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా మొన్నటి వరకు ఒకింత క్లీన్ షేవ్ తో కనిపించిన పవన్, ఇటీవల కొద్దిగా క్రాఫ్ పెంచుకుని, కొద్దిపాటి గడ్డంతో దర్శనం ఇస్తున్నారు. అయితే పవన్ ఆ విధంగా క్రాఫ్, గడ్డం లుక్ లో కనపడుతోంది తన తదుపరి సినిమా కోసమేనని, 

 

ఆ సినిమాలో పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్న పవన్, ఒకింత మధ్య వయస్కుడైన వ్యక్తి పాత్రలో నటించవలసి ఉండడంతో ఆ విధంగా కొద్దిగా గడ్డం పెంచుతున్నారని అంటున్నారు. దిల్ రాజు, బోని కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే పవన్ లుక్ విషయమై నేడు ప్రచారం అవుతున్న వార్త పై సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: