అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎంత పాపులర్ అయ్యారో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో గ్లామర్ గా అదిరిపోయో రొమాన్స్ చేస్తూ నటించిన షాలినీ పాండే కూడా అంతే పాపులర్ అయింది. ఈ సినిమా పోస్టర్స్ పడ్డ దగ్గర్నుంచే అందరు షాలిని ఇండస్ట్రీని ఏలేస్తుందనుకున్నారు. మరో బ్యూటి ఫుల్ అమ్మాయి దొరికింది. లాంగ్ టైం సౌత్ లో కొనసాగుతుందని అనుకున్నారు. కానీ ఎందుకనో షాలిని కెరీర్ అందరు అనుకున్నట్టు, తను ఊహించినట్టు సాగడం లేదు.  ఈ ఏడాది కళ్యాణ్ రామ్ తో 118 అనే సినిమాతో ఆకట్టుకున్న షాలిని పాండే.... ఆ సినిమాలో సో సో కేరెక్టర్ చేసినా.. హిట్ అయ్యిది కాబట్టి.. షాలిని పాండే కి రాజ్ తరుణ్ సరసన ఇద్దరిలోకం ఒకటే సినిమా అవకాశం ఇచ్చారు దిల్ రాజు. 

 

అర్జున్ రెడ్డిలో బోల్డ్‌గా, మహానటిలో సావిత్రి ఫ్రెండ్ గా ట్రెడిషనల్ గా, 118 లో కళ్యాణ్ రామ్ కాబోయే భార్య గా మంచి నటన కనబర్చింది. కాకపోతే అర్జున్ రెడ్డి తర్వాత క్రేజ్ పెరిగి ఎక్కడో ఉంటుంది అనుకుంటే... షాలిని కి అవకాశాలే రాలేదు. ఇక కోలీవుడ్ లో చేస్తున్న సినిమాలతో షాలిని సమస్యలు కొని తెచ్చుకుంది. మరోపక్క బాలీవుడ్ రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరో సినిమాలో షాలిని కి కేరెక్టర్ కన్ఫర్మ్ అయ్యింది. ఇక షాలిని పాండే తాజాగా నటించిన ఇద్దరి లోకం ఒక్కటే సినిమా విడుదల కావడం.. నెగటివ్ టాక్ రావడం అలా జరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో షాలిని పోటీ పడి నటించిందనే చెప్పాలి. ఇంకా చెపాలంటే మన కూర్ర హీరోని ఈ బ్యూటీ బాగా డామినేట్ చేసింది.

 

ఇక ఈ సినిమాలో షాలిని పాండే నటనపై క్రిటిక్స్ రకరకాలుగా కామెంట్ చేశారు. ఒకరు... సినిమా మొత్తంలో మంచి పెర్ఫామర్ ఎవరైనా ఉన్నారంటే అది షాలిని పాండేనే అని... తన పాత్ర ఎలా ఉన్నప్పటికి.. షాలినీ మాత్రం చక్కటి హావభావాలతో ఆకట్టుకుంది. షాలిని మంచి నటి అనే విషయం కొన్ని కొన్ని సన్నివేశాల్లో అద్దంలా కనిపిస్తుంది. అయితే దర్శకుడు ఆమె టాలెంటుని ఉపయోగించుకోలేకపోయాడు. అంతేకాకుండా షాలిని పాండే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అందంగా కూడా కనిపించింది. చూడ్డానికి క్యూట్‌గా వుంది. ఇక మరొకరు షాలిని పర్‌ఫార్మెన్స్‌ జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. లుక్ వైజ్ బాగానే ఉన్నా.. సీన్లలో దమ్ములేక నటన పండలేదు... అంటూ షాలిని పాండే నటనను కామెంట్ చేశారు. మరి షాలిని పాండే కి తెలుగులో మరో అవకాశం రాలేదు. మరి త్వరలో ఏవైనా ఛాన్సులు వస్తాయోమో చూడాలి. ఇక బాలీవుడ్ లో చేస్తున్న సినిమాతోనైనా క్లిక్ అయితే ఓకే లేదంటే పాపం పరిస్థితి కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: