ఎవరైనా హీరో బర్త్ డే వచ్చింది అంటే అభిమానులు ఎంత సందడి చేస్తారో  తెలిసిన విషయమే. తమ అభిమాన హీరోల బర్త్ డే కి పెద్ద పెద్ద  కటౌట్లు బ్యాండ్ బాజా కేక్ కట్టింగ్  అంటూ హడావిడి బాగానే ఉంటుంది. తమ అభిమాన హీరో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అభిమానులు హీరోల కటౌట్లు ముందు బర్త్ డే వేడుకలు జరుపుతూ ఉంటారు. అయితే హీరోల పుట్టిన రోజులను అభిమానులు నిర్వహించడం కామన్. కానీ అభిమానుల పుట్టిన రోజులను హీరో సెలబ్రేట్ చేయడం చాలా అరుదు. ఇక్కడ అలాగే చేశాడు ఓ హీరో. హీరో బర్త్ డే ని అభిమాని సెలబ్రేట్ చేయడం కాదు అభిమాని బర్త్ డే ని సెలబ్రేట్ చేశాడు హీరో . ఆ హీరో ఎవరంటే విజయ్ సేతుపతి. సైరా నరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం యువ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న తలపతి 64 సినిమాలో  విజయ్ సేతుపతి విలన్ గా  నటిస్తున్నారు. 

 

 

 అక్టోబర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా ఇటీవలే విజయ్ సేతుపతి ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ కర్ణాటక లో జరుగుతుంది. ఈ సందర్భంగా షూటింగ్ లో పాల్గొన్న విజయ్ సేతుపతి తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసాడు. షూటింగ్లో కేక్ కట్ చేసీ  అభిమానికి ప్రేమతో తినిపించాడు విజయ్ సేతుపతి. షూటింగ్ సందర్భంగా కర్ణాటక లోని ఓ హోటల్ లో తమ అభిమాన హీరో విజయ్ సేతుపతి ఉంటున్నాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూడడానికి తరలివచ్చారు. అయితే ఆ రోజే ఓ అభిమాని పుట్టినరోజు కూడా కావడం తో విజయ్ సేతుపతి సమక్షంలో కేక్ కట్ చేయాలని భావించిన అభిమాని విజయ్ సేతుపతి వద్దకు కేక్ తీసుకుని వెళ్లారు. తన చేతుల మీదుగా పుట్టినరోజు జరుపుకోవాలని అభిమాని కోరాడు.

 

 


 ఇక అభిమాని కోరిక మేరకు హీరో విజయ్ సేతుపతి కేక్ కట్ చేసి అభిమానికి తినిపించి సెలబ్రేషన్ చేశాడు. దీంతో అభిమాని సంతోషం లో మునిగిపోయాడు. తన అభిమాన హీరో సమక్షంలో తన పుట్టినరోజు జరగడం... తన అభిమాన హీరో తన పుట్టిన రోజున సెలబ్రేట్ చేయడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ప్రస్తుతం కర్నాటకలోని శివమొగ్గ జైలు లో చిత్రీకరణ జరుపుకుంటుంది విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్న సినిమా... జనవరి 18 వరకు జైలులో చిత్రీకరించడానికి చిత్రబృందం అనుమతి తీసుకుంది . కాగా  న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో సరదాగా గడపడానికి షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు విజయ్ సేతుపతి. కొత్త సంవత్సరంలో మళ్లీ తిరిగి షూటింగ్లో బిజీ అవ్వ నున్నాడు హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: