‘బాయ్స్’ సినిమాలో డ్రమ్స్ వాయిస్తూ స్నేహితులను ఉత్తేజపరిచే బొద్దు కుర్రాడిని చూసి అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ప్రేక్షకులు ఊహించి ఉండరు. సినీ ప్రేక్షకులకు ఆయన నటుడిగా పరిచయమైనా.. ధ్యేయం మాత్రం సంగీత దర్శకుడు కావడమే. ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకుల వద్ద పనిచేసిన అనుభవంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన ఈ యువ సంచలనం తన సంగీతంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇప్పటి వరకు సుమారు 80 సినిమాలకు సంగీతం అందించాడు. ఇంకా అందిస్తూనే ఉన్నాడు. రొటీన్ మ్యూజిక్ ముద్రతో మధ్యలో కొన్నాళ్లు అవకాశాలకు దూరమైనా మళ్లీ ఫామ్‌లోకి వచ్చి పడిలేచిన సంగీత కెరటంలా దూసుకుపోతున్నాడు.

 

అలాగే ఒక టైంలో థమన్ అంటే రొటీన్ సంగీతాన్ని అందిస్తూ ప్రేక్షకుల బుర్ర తినేస్తుంటాడని, కాపీ క్యాట్ అని చాలా విన్నాం. అలాంటి సంగీత దర్శకుడు ఇపుడు టాలీవుడ్ లో సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం.

 

ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాల ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు థమన్. స్క్రిప్ట్ కి తగ్గట్లుగానే పాటలు వుంటాయని, కథ రొటీన్ గా ఉంటే పాటలు కూడా అలానే వుంటాయని థమన్ అన్నారు. దూకుడు చిత్రం తో సూపర్ హిట్ సాంగ్స్ అందించి మంచి ఫామ్ లో వున్న థమన్ ని బిజినెస్ మాన్ చిత్రం లోకి పిల్లా చావు పాట తనని కిందకి లాగేసింది అని అన్నారు. దర్శకుడు కారణంగానే ఆ పాటని యాజిటీజ్ గా ఇవ్వాల్సి వచ్చిందని థమన్ అన్నారు.

 

ట్రోలింగ్ తర్వాత తొందరపాటుగా సినిమాలు చేయకుండా నో చెప్పడం నేర్చుకున్నానని అన్నారు. సరైనోడు చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని, నా తప్పుల్ని ఏంటో తెలుసుకున్నా అని అన్నారు. తప్పు కథలోనే ఉందని నిర్ణయించుకున్నాక దర్శకులకు నో చెప్పడం నేర్చుకోవడం మాత్రమే కాకా, స్టీరియోటైప్ స్క్రిప్ట్ లు తీసుకోవడం మానేశాను అని అన్నారు. అలా చేయడం వలనే మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ, అరవింద సమేత చిత్రాలు చేయడం జరిగింది అని అన్నారు. ప్రస్తుతం అలా వైకుంఠపురంలో చిత్రంలోని పాటలు కేవలం తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా , సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: