మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ సినిమాలలో మ్యాజిక్ ఉంటుంది. జస్ట్ మ్యాజిక్ అంతే. కానీ ఆ మ్యాజిక్ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి కారణం అవుతుంటుంది. హీరోని క్లాస్ గా చూపించాలన్నా, మాస్ గా చూపించాలన్నా ఆయన స్టైలే వేరు. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ ని మించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరని చెప్పాలి. ఇక ఆయన సినిమాలలో కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. సున్నితమైన పదాలతో కడుపుబ్బా నవ్వించి చంపేస్తారు. పంచ్ డైలాగ్స్ తో ప్రాణాలు తోడేస్తారు.

 

ఇక హీరో ఎలివేషన్ అయితే హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉంటుంది. హీరో ఎవరైనా త్రివిక్రమ్ చూపించే బిల్డప్ కి ఆ హీరో ఫ్యాన్స్ థియోటర్స్ లో సీట్లు చించేయాల్సిందే. ఇక ఆయన సినిమాలలో ప్రాంతీయ యాసను భాషను ఉపయోగించడం ద్వారా ఆ ప్రాంతానికి కనెక్టయిపోవడం సులువు. ఈ లాజిక్ ని  ఫాలో చేయడంలో మన దర్శకుల తర్వాతనే. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇందులో రాటు దేలిపోయారు. స్వతహాగా ఆయన రచయిత కావడంతో మాండలీకాలు.. యాసల్ని బాగా పరిశీలించి వాటిని తన సినిమాలకు కావలసినట్టుగా ఉపయోగించుకుంటారు. ఇప్పటికే తెలుగు భాషలోని అన్ని మాండలికాల్ని.. యాసల్ని త్రివిక్రమ్ తన సినిమాలకు ఉపయోగించుకున్నారు. 

 

ప్రస్తుతం తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో కూడా ఇందుకు తక్కువేమీ కాదు. ఈ సినిమాలో చిత్తూరు యాసతో పాటు శీకాకుళం యాసను వాడేస్తున్నాడట. అయితే ఈసారి కాస్త తెలివిగా పాటల్లో ఉపయోగిస్తున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ అందించిన చార్ట్ బస్టర్ సాంగ్స్ యూత్ లోకి దూసుకెళ్లాయి. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' సినిమా నుంచి రిలీజైన అన్ని లిరికల్ వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయాయి అంటే అది గొప్ప విషయమే. సామజవరగమన...రాములో రాముల... ఓ మైగాడ్ డాడీ... బుట్ట బొమ్మ .. అంటూ నాలుగు పాటల్ని రిలీజ్ చేశారు. ఈ నాలుగు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్లు అయ్యాయి.

 

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసారి ఓ జానపద గీతంతో ఫ్యాన్స్ ముందుకు రానున్నారట. పక్కా శ్రీకాకుళం యాసతో కూడుకున్న జానపద గీతాన్ని అల బృందం వినిపిస్తారట. ఇప్పటికే రాముల రాముల పాటలో నైజాం యాస వినిపించిన త్రివిక్రమ్.. ఈసారి శ్రీకాకుళం యాసపై దృష్టి సారించారనే అంటున్నారు. ఇక ఈ పాటను శ్రీకాకుళానికి చెందిన జానపద కళాకారుడుతో పాడించి ప్రయోగం చేశారట. థమన్ బీట్ కి శ్రీకాకుళం యాసకు మెర్జింగ్ కుదిరితే మరో చార్ట్ బస్టర్ ఖాయమేనన్న మాటా వినిపిస్తోంది. అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజవుతోంది. ఇక ఈ ఒక్క సినిమాలోనే ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు మరి రిజల్ట్ విషయం ఎలా ఉంటోదనని కొంతమంది చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: