సినిమాల్లో హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఏ చిన్న అన్యాయం జరిగిన విలన్ లు  అందరికీ బాగా బుద్ధి చెబుతూ ఉంటారు. ప్రజలను  ఎప్పటికప్పుడు కాపాడుతూ హీరో అంటే ఇలాగే ఉండాలి ఏమో అన్నట్టుగా ఉంటారు. కానీ నిజ జీవితం విషయం వచ్చేసరికి చాలామంది ఏం జరిగినా పెద్దగా పట్టించుకోరు స్పందించరు. వాళ్ల పనేదో  వాళ్లు చూసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది కేవలం నటన వరకే హీరోలుగా ఉంటే..ఇంకొంతమంది మాత్రం నిజజీవితంలో కూడా హీరోలుగా ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే స్పందిస్తూ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో లుగా  అంటూ నిరూపించుకున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఇలా రిల్ లైఫ్ లోనే కాదు... రియల్ లైఫ్ హీరోలుగా కూడా మారిపోయారు. 

 

 

 

 సాధారణంగా అయితే సినిమాల్లో హీరోలు  హంతకులను అవినీతిపరులకు బుద్ది చెబుతూ ఉండటం   చూస్తుంటాం . రియల్ లైఫ్ లో హీరో అయిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా  ఓ  కన్నడ హీరో రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అని నిరూపించుకున్నాడు. ఆయనే కన్నడ హీరో రఘుభట్. శుక్రవారం బెంగళూరులో తెల్లవారుజామున క్యాబ్ డ్రైవర్ వద్ద చోరీ చేసి పరారవుతున్న ఇద్దరు దొంగలను... అటువైపుగా ఫార్చునర్ కార్ లో వస్తున్న హీరో రఘుభట్  గమనించారు. మనకెందుకులే అని వదిలేయకుండా... బైక్ పై పారిపోతున్న ఆ దొంగలను సుమారు రెండు కిలోమీటర్ల వరకు కారులో వెంబడించారు. ఇక సెయింట్ జాన్స్ స్కూల్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. 

 

 

 

 వెంటనే హీరో రఘుబట్ ఆ ఇద్దరు దొంగలను పట్టుకున్నాడు. ఇక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు హీరో రఘుభట్ . దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు  కాగా  అతి వేగంగా వెళ్తున్న సమయంలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఆ ఇద్దరు దొంగలు కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరు దొంగల్లో  ఒకరి తలకు మరొకరీ  చెయ్యికి తీవ్ర గాయాలు కావడంతో ఇరువురిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనతో రిల్ హీరో రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుని  అందరి ప్రశంసలు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: