ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, నటి శ్రుతి హాసన్. లండన్ కి చెందిన నటుడు మైఖేల్ కోర్స్‌ల్‌తో శ్రుతి కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. శ్రుతి.. మైఖేల్ లు ముంబయిలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. శృతి కోసం మైఖేల్ చెన్నైకి కూడా వ‌చ్చాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల వీరు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఈ విష‌యాన్ని మైఖేల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకునే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. అయితే శృతి తీసుకున్న ఈ నిర్ణ‌యంతో స‌డెన్‌గా అంద‌రూ ఖంగుతిన్నారు. ఆ త‌ర్వాత శృతి త‌న కొత్త ప్రాజ‌క్టుల‌తో బిజీ అయిపోయారు. గ‌త కొన్ని రోజులుగా సినిమాలు త‌న సంగీత కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. 

 


ఇక ఇదిలా ఉంటే... గత కొంతకాలంగా శ్రుతిహాసన్ ఎందుకనో సైలెంటుగా తన పని తాను చేసుకుపోతోంది. మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా సినిమాలు.. విదేశీ కాన్సెర్టులపైనే దృష్టి సారిస్తోంది. ఇక ఇటీవలి కాలంలో కాన్సెర్టుల్ని కూడా తగ్గించి సినిమాలకే ప్రాధాన్యతనిస్తోంది ఎందుకనో. ప్రస్తుతం ఓ రెండు చిత్రాలకు కమిటై ఆ పనిలోనే బిజీగా ఉంది. అలా షూటింగ్ బిజీలో ఉన్నప్పుడే ఇదిగో ఇలా సెట్స్ లో తనకో కొత్త ఫ్రెండ్ పరిచయమయ్యాడు. తనను ఎత్తుకుని ఇలా ఫోటోకి ఫోజిచ్చింది. హి ఈజ్ సో క్యూట్.. లవ్ లీ. పొట్టిగా బుజ్జిగా ముద్దుగా ఉన్న ఆ కుక్క పిల్ల శ్రుతి ఇచ్చిన హగ్గుకి ఎంతో ప్రేమగా అలా ఒదిగిపోయింది మరి. మాస్ మహారాజా రవితేజ సరసన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రాక్ చిత్రంలో శ్రుతి కథానాయికగా నటించనుంది. ఓ తమిళ చిత్రంలోనూ శ్రుతి నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

గత కొంతకాలంగా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చిన శృతి హాసన్ మైఖేల్ కోర్సలే అనే వ్యక్తితో ప్రేమలో మునిగిపోయింది. వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా తీసుకెళ్లి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి కమల్ హాసన్ తో కలిసి సాంప్రదాయ కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అని ఎన్నోవార్త‌లు కూడా వ‌చ్చాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: