సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై టాలీవుడ్ సినిమా ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు, తొలిసారిగా మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కొంత గ్యాప్ తరువాత నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి. ఇక మహేష్ ప్రక్కన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నాడు. 

 

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎంతో భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చినప్పటికీ, సాంగ్స్ కు మాత్రం కొంతవరకు మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా నుండి ఆఖరి ఐదవ సాంగ్ టీజర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. డ్యాంగ్ డ్యాంగ్ అనే పల్లవితో సాగె ఈ సాంగ్ లో తమన్నా ప్రత్యేకంగా మహేష్ తో కలిసి నృత్యం చేసింది. 

 

సోల్జర్స్ మధ్యన మంచి హుషారుగా సాగె ఈ పార్టీ సాంగ్ టీజర్ కు ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ సాంగ్ రేపు థియేటర్ లో అదరగొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నకాష్ అజిజ్, ల్యావిటో లోబో పాడిన ఈ హుషారైన గీతాన్ని రాసింది రామజోగయ్య శాస్త్రి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5న హైదరాబాద్ లో జరగనుండగా, సినిమాని జనవరి 11న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: