అసెస్టెంట్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రాజ్‌త‌రుణ్‌. అనుకోకుండా ఉయ్యాల జంపాలా సినిమాలో హీరో అయ్యాడు. దీంతో హీరోగానే అవ‌కాశాలు ఎక్కువ రావ‌డంతో కెరియ‌ర్‌ని అటువైపు తిప్పుకున్నాడు. ఇక ఆ సినిమా  సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంతో ఒక్క‌సారిగా రాజ్‌త‌రుణ్ క్రేజ్ మారిపోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన `సినిమా చూపిస్త‌మామ‌`, `కుమారి 21 ఎప్‌` రెండూ హిట్‌కొట్ట‌డంతో హీరోగా నిల‌బ‌డిపోయాడు. 

 

ఇక నిర్మాత‌ల సంగ‌తి తెలిసిందే ఒక్క హిట్ కొడితే చాలు అంద‌రూ వాళ్ళ వైపే ఉంటారు. అలా ఏకంగా మూడు హిట్‌లు కొట్ట‌డంతో నిర్మాత‌లంద‌రూ క్యూక‌ట్టి మ‌రి ఏకంగా కోటి రూపాయ‌ల వ‌రు పారితోషికం ఇచ్చి మరి సినిమాలు చేశారు. దాంతో వ‌రుస అవ‌కాశాలు రావ‌డంతో కాస్త క‌థ‌ల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌లు వ‌హించ‌లేక‌పోయాడు. వ‌చ్చి ప్ర‌తీ అవ‌కాశాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. ఆ త‌ప్పులు ఎలా ఉన్నాయంటే ఏకంగా రెండేళ్ళ కాలంలో అర‌డ‌జ‌న్ ఫ్లాప్ సినిమాలు వ‌చ్చేంత రేంజ్‌లో ఉన్నాయి. 

 

కెరీర్ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతతో సినిమా సెట్ కావడంతో రాజ్ తరుణ్ కాస్త కోలుకున్నాడు అనుకున్నారంతా. కానీ ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌చ్చిన `ల‌వ‌ర్‌` చిత్రం డిజాస్ట‌ర్ అయింది. దీంతో మ‌రోసారి అవ‌కాశం ఇచ్చాడు దిల్‌రాజు ఆయ‌న బ్యాన‌ర్‌లో `ఇద్ద‌రి లోకం ఒక‌టే` అంటూ వ‌చ్చాడు. ఈ సినిమా అయినా రాజ్‌త‌రుణ్‌ని ఆదుకుంట‌దేమో అనుకున్నారు కానీ ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఓపెనింగ్స్ కూడా రాక‌పోవ‌డంతో డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. ఇక పై రాజ్‌త‌రుణ్ హీరోగా సినిమాలు చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన అత‌ని పై పెట్టుబ‌డి పెట్టి తియ్య‌డానికి నిర్మాత‌లు సాహ‌సిస్తారో లేదో వేచి చూడాలి. ఇక రాజ్‌త‌రుణ్ చేయ‌బోయే సినిమాలు దాదాపుగా మాస్ క్యారెక్ట‌ర్స్ అయితే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఆ ఒక్క చిన్న లాజిక్‌ని ఎలా మిస్ అవుతున్నాడో అర్ధం కావ‌డం లేదు అంటున్నారు కొంద‌రు సినీ విశ్లేష‌కులు. మాస్ క్యారెక్ట‌ర్స్ చేసిన ప్ర‌తి సినిమా హిట్ బాట ప‌ట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: