‘సాహో’ పరాజయం చెందినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అని నిరూపించే ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు జరిగింది. మరో రెండు రోజులలో కొత్త దశాబ్దం లోకి మనం ప్రవేశించ బోతున్నాము. ఇలాంటి పరిస్థితులలో 2010  నుండి 2019 వరకు గడిచిన 10 సంవత్సరాలలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హీరో ఆఫ్ ది డికేడ్ ఎవరు అంటూ ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఆన్ లైన్ ఓటింగ్ ను ప్రకటించింది. 

ఈ లిస్టులో బాలీవుడ్ టాప్ హీరోలతో పాటు ప్రభాస్ కూడ స్థానం పొందాడు. గడిచిపోతున్న ఈ దశాబ్దంలో ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘మిర్చి’ ‘బాహుబలి 1’ ‘బాహుబలి 2’ ‘సాహో’ లు విడుదల కావడంతో ఈ దశాబ్దంలో ప్రభాస్ కు సంబంధించి విడుదలైన సినిమాలలో ఒక్క ‘సాహో’ మినహా అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ కు ఈ లిస్టులో స్థానం కల్పించినట్లు ఈ మీడియా సంస్థ వివరణ ఇచ్చింది. 

దీనితో ప్రభాస్ అభిమానులు ‘హీరో ఆఫ్ ది డికేడ్ ప్రభాస్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ప్రభాస్ కు ఓట్లు వేయండి అంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఆన్ లైన్ ఓటింగ్ ఫలితాలు రావడానికి మరి కొద్దిరోజులు పట్టే అవకాశం ఉన్నా అప్పుడే ప్రభాస్ ‘హీరో ఆఫ్ ది డికేడ్’ అయిపోయినట్లుగా అతడి వీరాభిమానులు హంగామా చేస్తున్నారు. 

బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దర్శకుడు సందీప్ వంగాతో ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ త్వరలో మొదలు పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్న మూవీ ప్రాజెక్ట్ కు ప్రభాస్ కు 70 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే దక్షిణాది సినిమా రంగంలో రజినీకాంత్ అందుకునే పారితోషికాన్ని కూడ క్రాస్ చేసిన టాప్ హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: