గత ఏడాది వచ్చిన మహానటి చిత్రం ఎంత మంచి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.  కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించిందనే చెప్పాలి. అప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ఆ అంచనాలను మించి అందుకున్న చిత్రమిది. ఒక బయోపిక్ కి ఇంతటి ఆదరణ రావడం నిజంగా ఆశ్చర్యమే. అయితే దానికి కారణం దర్శకుడే. నాగ్ అశ్విన్ తాను అనుకున్నట్టుగా సినిమాని ప్రేక్షకులకి చూపించగలిగాడు.

 

 

అయితే ఈ సినిమాలో ఎక్కువ ఆకర్షించింది కీర్తి సురేష్. సావిత్రి లాగా నటించడమంటే చిన్న విషయం కాదు. మాటలోనూ, ఆహార్యంలోనూ కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలానే కనిపించింది. సినిమాలో లీనమయ్యాక కీర్తి సురేష్ మాయమయ్యి సావిత్రినే కనిపిస్తుంది. అంతటి మాయ చేసింది కీర్తి సురేష్. అందుకే ఆమెకి మహానటి సినిమాకి గాను జాతీయ అవార్డు వచ్చింది. అయితే ఆ సినిమా చేయడం వెనక ఎవరున్నారో చెప్పింది.

 

 

 

తనకు ఇంతటి పేరు తెచ్చిపెట్టిన మహానటి పాత్రను ఒప్పుకోవడానికి కారణం ఒక వ్యక్తి అట. కీర్తి సురేష్ మామయ్య గోవింద్ గారే సావిత్రి పాత్రను కీర్తి సురేష్ ఒప్పుకోవడానికి కారణమట. సావిత్రమ్మ పాత్రను చేయగలనా లేదా అనే సందేహంలో ఉన్నప్పుడు, నువ్వు  బాగా చేయగలవు అనే  నమ్మకం తనకు తన మామయ్య గారే ఇచ్చారని, ఈ మూవీని తాను ఒప్పుకోవడానికి ఆయనే కారణమని ఆమె చెప్పుకొచ్చింది. 

 

 

 

 

ఇక ఈ సంధర్భంగా తనను నమ్మినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్‌కు చాలా థ్యాంక్స్ అని కీర్తి తెలిపింది. మహానటి సినిమా తర్వాత తన మీద చాలా ఒత్తిడి పెరిగిందట. తన దగ్గరికొచ్చే కథల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె రెండు లేడి ఓరియంటేడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: