తెలుగులో మొన్నటి వరకు చిన్న సినిమాల హవా నడిచింది. బాక్సఫీసు వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మధ్య తెలుగు సినిమాల్లో చాలా మార్పు వస్తుంది. చిన్న సినిమాలకి పెద్ద నిర్మాతలు సాయమ్ చేయడం నిజంగా మంచి పరిణామం. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా సరే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతే కాదు ఒక్కోసారి చిన్న సినిమా ప్రొడక్షన్ లోనూ పాలు పంచుకొంటున్నారు.

 

పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద సినిమాల వల్ల బిజీగా ఉంటాయి. అయితే ఆ పెద్ద సినిమాలు రావడానికి ఎంతో సమయం పడుతుంది. ఆ సమయంలో పెద్ద నిర్మాతలు తమకు నచ్చిన చిన్న చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. కంటెంట్ బాగుండి, సినిమా తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్ తో తీసేది అయితే దానిపై డబ్బు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల క్రిస్మస్ రోజున రిలీజై మౌత్ టాక్ ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న చిత్రం మత్తు వదలరా చిత్రం విషయంలో అలాగే జరిగింది.

 

కీరవాణి కొడుకులు ఒకరు హీరోగా నటించగా, మరొకరు ఈ సినిమాకి నేపథ్య సంగీతం అందించారు. రితేష్ రానా అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి టాక్ ని తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు  రవిశంకర్, చెర్రి(చిరంజీవి)లు పాత్రికేయులతో ముచ్చటించారు. మత్తువదలరా విషయంలో కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే ఈ రోజు సినిమా విజయంలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. 

 

పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: