2020 లో క్రేజీ మూవీగా రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కచ్చితంగా మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.   

 

సినిమా మొదలు పెట్టి చాలా నెలలు అవుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి ఒక్క పోస్టర్ కూడా వదలలేదు. అయితే సిని లవర్స్ మాత్రం ఈ సినిమా మీద రకరకాల పోస్టర్స్ సొంతంగా క్రియేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రాం చరణ్, తారక్ ఆర్.ఆర్.ఆర్ యానిమేటెడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో చొక్కా విప్పి విల్లు పట్టుకున్న రాం చరణ్.. తలపాగా కట్టి తుపాకి చేత పట్టిన కొమరం భీం లుక్ లో తారక్ ఉన్నాడు.

 

పోస్టర్ ఏ రేంజ్ లో ఉంది అంటే ఏకంగా ఆర్.ఆర్.ఆర్ టీం దీనిపై స్పందించేలా చేసింది. హ్యాపీ ఆర్.ఆర్.ఆర్ ఇయర్ యే దోస్తీ 2020 అంటూ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పోస్టర్ పై ఆర్.ఆర్.ఆర్ టీం కూడా గూడ్ వర్క్ అని ప్రశంసలు కురిపించింది. సినిమాలో చరణ్, తారక్ చేస్తున్న పాత్రలతో పోస్టర్ వచ్చినా ఇద్దరు చేతులు కలిపి ఉండటం పోస్టర్ కు అందం తెచ్చింది.

 

ఆర్.ఆర్.ఆర్ సినిమా చేయడానికి ముఖ్య కారణం రాం చరణ్, ఎన్.టి.ఆర్ ల మధ్య ఉన్న స్నేహమే అని చెప్పొచ్చు. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు. రాజమౌళి ఈ సినిమాను మరో సెన్సేషనల్ హిట్ గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: