రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కన్నడ భామ రష్మిక మందన్న ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అదరగొడుతున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా వారు స్నేహంగా ఉంటున్నారు. గీతా గోవిందంతో హిట్ పెయిర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ రష్మికలు ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి పనిచేశారు. ఆ సినిమా కేవలం తెలుగులోనే కాదు సౌత్ అన్ని భాషల్లో రిలీజైంది.

 

బిహైండ్ వుడ్స్ వారు నిర్వహించిన గోల్డ్ మెడల్స్ అవార్డుల్లో విజయ్, రష్మికల జోడీ అలరించింది. ఈ అవార్డుల్లో భాగంగా రష్మికకు డియర్ కామ్రేడ్ లిల్లీ పాత్రకు గోల్డ్ మెడల్ వచ్చింది. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకుంది రష్మిక మందన్న. అయితే స్టేజ్ మీద ఇద్దరు కనిపించే సరికి ఆడియెన్స్ కేకలు పెట్టారు. ఇక స్టేజ్ మీద రష్మిక తమిళ ఆడియెన్స్ ను అలరిస్తూ చెప్పిన మాటలు మెప్పించాయి.

 

విజయ్, రష్మిక ఇద్దరిది క్రేజీ జోడీ ఈ ఇద్దరు స్టేజ్ మీద కూడా తమ కళ్లతో మాట్లాడుకున్నారు. అంతేకాదు నీకు పర్ఫెక్ట్ జోడీ నేనే అని రష్మిక చెప్పగా అది నిజమే అంటూ విజయ్ అన్నాడు. ఇక గీతా గోవిందంలో ఏంటి.. ఏంటి.. వరుస సాంగ్ లో విజయ్ వెనుకాలే వెళ్తూ అతన్ని ఇమిటేట్ చేస్తుంది రష్మిక. అదే ర్యాంప్ మీద చేయాలని యాంకర్స్ కోరగా అలా చేసి చూపించారు.

 

ఇక రష్మిక క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అవార్డ్ ఫంక్షన్ లో అందరిని అలరించింది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి జోడీ అదిరిపోయింది. చేసింది రెండు సినిమాలే కాని విజయ్, రష్మిక జోడీ అనగానే ఆడియెన్స్ లో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పూరి సినిమా ఉంటుంది. రష్మిక కూడా మహేష్ సరిలేరు నీకెవ్వరు.. నితిన్ భీష్మ సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల తర్వాత రష్మిక అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: