టీవీ ఆర్టిస్టులకు మంత్రి తలసాని  శ్రీనివాస్‌యాదవ్‌ శుభవార్త చెప్పారు.. టీవీ ఆర్టిస్టులు చాలా సార్లు పలువిధాలుగా ఇబ్బందులను ఎదుర్కొటున్నట్లుగా వచ్చిన వార్తలతో స్పందించిన మంత్రి జనవరి 4న రవీంద్రభారతిలో రాష్ట్రంలోని టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులను అందజేయనున్నట్టు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు.

 

 

ఈ సందర్భంగా శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 900 మంది టీవీ ఆర్టిస్టులు ఉన్నారని..  వారందరికీ ఒకే సారిగా గుర్తుంపు కార్డులు అందజేస్తామని చెప్పారు. అంతే కాకుండా ఆర్టిస్టులలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఆర్టిస్టులు అర్దరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా షూటింగ్‌ల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది.

 

 

ఆ సమయ్మలో పోలీసుల నుంచి తమకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు సమావేశాల్లో అసోసియేషన్‌ సభ్యులు మంత్రికి వివరించారు. అసోసియేషన్‌ వినతి మేరకు స్పందించిన ప్రభుత్వం టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ సీఈవో కిశోర్‌బాబు, ఈడీ హష్మి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

ఇకపోతే పలువురు టీవీ ఆర్టిస్టులు తమ బాధను అర్ధం చేసుని మా టీవీ ఆర్టిస్ట్ సంఘానికి గుర్తింపు కార్డులు అందచేస్తున్న సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కు, మరియు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.. ఇకపోతే ఈ గుర్తుంపు కార్డుల వల్ల తాము ఎదుర్కొనే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుందని కొందరు టీవీ ఆర్టిస్టులు ఈ సందర్భంగా తెలిపారు. కొన్ని కొన్ని సమయాల్లో తాము ఆర్టిస్టులమని షూటింగ్ ముగించుకుని వస్తున్నామని చెప్పిన నమ్మని వారు ఈ గుర్తింపు కార్డులు చూపిస్తే ఇక నమ్మక తప్పదని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: