కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమే. ఇక తాజాగా జబర్దస్త్ కామెడీ షో నుంచి కమెడియన్‌గా వచ్చి ఇప్పుడు హీరో వరకు ఎదిగాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై మంచి ఇమేజ్, అలానే ఫాలోయింగ్ ఏర్ప‌ర్చుకున్న సుధీర్  ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేయగా..శేఖర్ రాజు నిర్మించారు. 

 

స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు. కానీ సుధీర్ ఆశలకు ఈ సినిమా గండి కొట్టినట్లు కనిపిస్తుంది. ఒక్క సుధీర్ తప్ప సినిమాలో చూడ్డానికి ఏం లేదంటూ తేల్చేసారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. పైగా పాత కథ.. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే అన్నీ సుధీర్ సినిమాకు మైనస్ అయ్యాయి.  అయితే ఈ చిత్రానికి తొలిరోజు కలెక్షన్స్ మాత్రం పర్లేదు అనిపించేలా వచ్చాయి. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ ఈ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్ తీసుకొచ్చేలా చేసింది. అలాగే డాన్స్ లలో ఆయన మాస్ హీరో రేంజ్ లో ఇరగదీశాడు. 

 

అమాయకుడైన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా సుధీర్ నటన ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. అయితే కామెడీ కోసం రైమింగ్ తో కూడిన పంచ్ లు రాసుకున్నప్పటికీ అవి తెరపై పేలలేదు. సుడిగాలి సుధీర్ మూవీ అంటే మంచి కామెడీ ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగించే సినిమాగా నిలిచింది. ఇక సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు తొలిరోజు 50 లక్షల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది. అయితే రెండోరోజు మాత్రం  కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి. దీనికి కార‌ణం.. ప్రతిరోజూ పండగే సినిమా ఇప్పటికీ దూకుడు చూపిస్తుండటంతో దాని ధాటికి మరే సినిమా తట్టుకోవట్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: