సినిమా అనగానే అందులో సరైన కధ ఉండాలి. దానికి తగ్గ దర్శకుడు ఉండాలి. వినసొంపైన సంగీతం ఉండాలి. హీరోయిన్స్ తో రోమాన్స్ ఉండాలని ప్రేక్షకుడు ఏదేదో ఊహించు కుంటారు. భారీ అంచనాలు పెట్టుకుని సినిమా థియేటర్స్ కు వెళ్లుతారు. అక్కడ కనీసం పాటలైన బాగున్నా సినిమా నెగ్గుకు రావచ్చూ అనుకుంటారు. ఇక సినిమా హిట్టు ఫట్టు సంగతి అలా ఉంచితే సినిమాలోని పాటతో కిక్కెక్కించినా కూడా ఆ సినిమా ఫట్ట్ అనే టాక్ తెచ్చుకున్న చిత్రాలు ఉన్నాయి.

 

 

ఇకపోతే సినిమా మీద మొదట అంచనాలు ఏర్పడాలి అంటే.. అది పాటలను బట్టే అని చెప్పాలి. ఇదే ట్రెండ్ ఎప్పటినుండో వస్తుంది. అయితే ఈమధ్య కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు పాటల కంటే ముందు టీజర్లను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ 2019 లో అనూహ్యంగా అంచనాలు లేని సినిమాలు హిట్ అయ్యాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అయితే ఆ సినిమాల పై అంచనాలు పెరగడానికి గల కారణం మాత్రం ‘చార్ట్ బస్టర్’ గా నిలిచిన లిరికల్ సాంగ్స్ అనే చెప్పాలి. ఇలా ఈ 2019 లో ఒక్క పాటతో అంచనాలు పెంచేసి.. ప్లాప్ అయిన సినిమాలు ఏంటో కాస్త చూద్దాం పదండి..

 

 

మొదటగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన సినిమా డియ‌ర్ కామ్రేడ్. ఈ సినిమా భారీ అంచ‌నాలతో రిలీజ్ అయ్యింది.కాని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. కాని ఇందులో నీ నీలి కన్నుల్లోన…” అంటూ సాగే ఒక సాంగ్ మాత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.  తర్వాత ఎబిసిడి చిత్రంలో మెల్ల మెల్లగా అంటూ సాగే పాట యూత్‌ను ఉర్రూతలూగించింది కానీ సినిమా ప్రేక్షకుల్ని పడుకోబెట్టింది. 

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే వినయ విధేయ రామా చిత్రంలో,  ఏక్ బార్ అంటూ సాగే గీతం..  మిస్టర్ మజ్ను సినిమాలో, కోపంగా కోపంగా అంటూ సాగే పాట... దొరసాని చిత్రంలో నింగిలోని పాలపుంత.. రణ రంగం మూవీలోని పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ వచ్చే సాంగ్.. గుణ 369 లో బుజ్జి బంగారం అనే గీతం.. అభినేత్రి 2 చిత్రంలో చల్ మార్ అంటూ మొదలయ్యే సాంగ్.. మన్మధుడు 2 లో హె మెనీనా.. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో హొయ్ నా .. హొయ్ నా అంటూ సాగే మొదలైన ఈ పాటలన్నీ ప్రేక్షకులకు చాలా దగ్గరగా చేరువయ్యాయి కాని ఈ సినిమాలే ఆశించిన స్దాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: