దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ హీరోగా తెరకెక్కిన తొలిసినిమా దిల్, అప్పట్లో సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ సినిమా పేరుతో ఆయనకు దిల్ రాజు అని అప్పటి నుండి పేరు వచ్చింది. ఇక అక్కడినుండి వరుసగా తమ బ్యానర్ పై ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ పోతున్న రాజు, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూశారు. నిజానికి రాజు బ్యానర్ నుండి ఏదైనా సినిమా వస్తుందంటే, ఆ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. అయితే మధ్యలో ఒక్కోసారి సినిమాలను జడ్జి చేసే విషయమై రాజు కొన్ని దెబ్బలు కూడా తిన్నారు. 

 

ఇక గత ఏడాది రాజ్ తరుణ్ తో ఆయన నిర్మించిన లవర్ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవ్వగా, తదుపరి ఎలాగైనా అతడికి తమ బ్యానర్ పై సక్సెస్ ని అందివ్వాలని ఇటీవల ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా పరాజయానికి ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలే కారణమని, అసలు ఇటువంటి కథతో తమ బ్యానర్ లో సినిమా తీయాలని రాజు ఎలా భావించారో అర్ధం కావడం లేదని కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోవడం సినిమా ఫెయిల్యూర్ కు ఒక కారణం అయితే, 

 

రిలీజ్ తరువాత పూర్తిగా సినిమాని ప్రమోషన్స్ విషయమై దర్శక, నిర్మాతలు ప్రక్కన పెట్టినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ప్రమోషన్స్ చేసి కూడా ఉపయోగం ఉండదని, ఒకరకంగా దానివలన తమ సంస్థ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని రాజు ప్రమోషన్స్ ని వదిలేసినట్లుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరిలోకం ఒకటే సినిమా, రాజ్ తరుణ్ కెరీర్ కు కూడా చాలా పెద్ద దెబ్బేసింది. ఇప్పటికే చాలావరకు కెరీర్ పరంగా ఎంతో వెనుకపడిపోయిన రాజ్ తరుణ్, ఇకపైనైనా ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తాడేమో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: