ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న ట్రెండ్‌ను పరిశీలిస్తే.. గత ఐదు సంవత్సరాల్లో ఎందరో కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో కొంతమంది ఇండస్ట్రీలో పాతుకుపోతే.. మరికొందరు చిన్నా చితక సినిమాలతోనే కనుమరుగయ్యారు.  అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, ఎన్నేళ్లుగా టాలెంట్‌తో నిలదొక్కుకోగలుగుతున్నారు అనేదే గమనించాలి. ఇదిలా ఉంటే.. కొందరు హీరోయిన్లు నటించింది ఒక్క సినిమా అయినా కూడా ఎప్పటికీ మరిచిపోలేని మాయ చేస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు అలాంటి హీరోయిన్లే ఉన్నారు. సింగిల్ మూవీ వండర్స్‌గా నిలిచి మాయ‌మైపోయిన హీరోయ‌న్ల‌పై ఓ లుక్కేసేయండి..

 

పూరీ జగన్నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో నాగార్జున హీరో తెర‌కెక్కిన `సూపర్` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది అయేషా టకియా. ఈ చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో కనపించ‌లేదు. మన్మథుడు సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అన్షు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పట్లో ఈమె పేరు మార్మోగిపోయింది. ఆ త‌ర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర చిత్రంలో కూడా నటించింది. కానీ ఆ తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయింది.  అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ సయేషా సైగల్. ఆ సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా తెలుగు ఇండస్ట్రీ ఈమెకు పెద్దగా కలిసిరాలేదు.

 

బాలయ్య వీరభద్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తను శ్రీ దత్తా.. ఆ తర్వాత మాత్రం తెలుగులో కనిపించలేదు. వన్ మూవీ వండర్ అయిపోయింది తను. బన్నీ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా నటించిన గౌరీ ముంజల్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా బన్నీ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. అల్లు అర్జున్ హీరోగా వరుడు సినిమాలో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన‌ భాను శ్రీ మెహ్రా. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అలా ఒక్క సినిమాకే ఆమె పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. నాగార్జున బ్లాక్ బస్టర్ సంతోషం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది గ్రేసీ సింగ్.  ఆ తర్వాత మోహన్ బాబు తప్పుచేసి పప్పుకూడులో కూడా నటించింది. కానీ ఊహించిన ఫ‌లితం రాలేదు.

 

పవన్ కల్యాణ్ బంగారం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి.. ఆ తర్వాత కనపించకుండా పోయింది మీరా చోప్రా. అలాగే ఆర్య సినిమాతో సంచలనంగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అనురాధ మెహతా. ఈ చిత్రంలో మంచి నటన కనబర్చిన అను.. తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ గీతాంజలి సినిమాలో లేచిపోదామా అంటూ సంచలనం రేపిన హీరోయిన్ గిరిజ షట్టర్ ఆ తర్వాత ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌లేదు. అతిథి సినిమాలో మహేష్ బాబు జోడీగా నటించిన అమృతా రావు ఆ సినిమా తర్వాత తెలుగులో నటించలేదు. ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఇక్కడ పట్టించుకోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: