టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల.. వైకుంఠపురంలో.. సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల సినిమా టీమ్ విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతూండటంతో సినిమా ప్రమోషన్లు భారీ స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి సినిమా టీమ్ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

 

 

వచ్చే ఏడాది జనవరి 6న అల.. వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన భారీ ప్రమోషన్ కార్యక్రమం జరుపనున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ ప్రాంతంలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి.. ఈ ఏడాది దీపావళి పండుగ నుంచే అల.. వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్లు ప్రారంభమైనట్టు చెప్పుకోవాలి. విడుదల చేసిన ప్రతీ పాట ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ ట్రెండింగ్స్ లో టాప్ లో నిలవడమే కాకుండా.. వ్యువర్ షిప్ లో టాలీవుడ్ నెంబర్ వన్ గా నిలిచింది. పాటలు హిట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకే కొత్తగా మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించాలని ప్లాన్ చేసింది యూనిట్.

 

 

బన్నీ పక్కన ఈ సినిమాలో పూజ హెగ్డే, నివేదిత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సీనియర్  నటి టబుతో పాటు పలువురు నటులు నటిస్తున్నారు. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అభిమానుల్లో ఈ సినిమా గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బన్నీ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: