సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు' సినిమా కలెక్షన్లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నే మతిపోగొట్టే విధంగా సాధించినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పట్లో ఆంధ్ర లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్నికల సమయంలో విడుదల కాకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఆ సమయంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగిన రామ్ గోపాల్ వర్మ ని బెజవాడ లో అడుగుపెట్ట నివ్వకుండా గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి తిరిగి హైదరాబాద్ కి పంపించడం జరిగింది.

 

ఆ తరువాత మళ్లీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని విడుదల చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడంతో ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్ ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సినిమా రంగంలో పెను సంచలనం సృష్టించారు. అయితే ఈ సినిమా విషయంలో టైటిల్ విషయంలో అనేక అభ్యంతరాలు రావడంతో టైటిల్ని 'అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు' గా మార్చడం జరిగింది. ఇటువంటి తరుణంలో సినిమా రిలీజ్ అవుతుందన్నా ఈ సమయంలో సినిమా అని కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సినిమా లో ఉన్న పాత్రలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పదవుల్లో కీలక నాయకులుగా ఉన్న వారిని తలపిస్తున్నాయి 'అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు' సినిమా విడుదల అవకుండా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ముప్పుతిప్పలు పెట్టడం జరిగింది.

 

అయితే చివరాకరికి రామ్ గోపాల్ వర్మ న్యాయస్థానంలో పోరాడి సినిమా రిలీజ్ అయ్యేలా చక్రం తిప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి షోకే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న కానీ కలెక్షన్ల విషయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి మతిపోగొట్టే టట్లు కలెక్షన్ వచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్లు పరిశీలిస్తే నైజాంలో 85 లక్షలు సీడెడ్ లో 34 లక్షలు వైజాగ్ లో 41 లక్షలు ఈస్ట్ లో 26 లక్షలు వెస్ట్ గోదావరి లో 16 లక్షలు గుంటూరులో 24 లక్షలు కృష్ణాలో 26 లక్షలు నెల్లూరులో 12 లక్షలు షేర్ సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో 2.64 కోట్ల షేర్ నీ సాధించింది. కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో ఆరు లక్షలు ఓవర్సీస్లో మూడు లక్షలు షేర్ సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పరుగులు పూర్తి అయిన సమయానికి 2.73 కోట్లను షేర్ సొంతం చేసుకోవడం జరిగింది. టోటల్ గ్రాస్ 4.82 కోట్ల షేర్ సాధించింది అని ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: