తెలుగులో తరుణ్ హీరోగా నటించిన ‘ప్రియమైన నీకు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన స్నేహ.. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్‌గా సత్తా చాటింది. ఆ తర్వాత తమిళంలో తన తోటి నటుడు ప్రసన్నను ప్రేమ వివాహాం చేసుకుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. 

 


తెలుగులో  అనేక మంది స్టార్ హీరోల సినిమాల్లో న‌టించినా.. త‌ను స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది స్నేహ‌. క‌మ‌ల్ హాస‌న్, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల‌తో స్నేహ న‌టించింది. న‌టిగా కూడా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. అయినా ఈ భామకి మాత్రం త‌గిన గుర్తింపు రాలేదు.  గ్లామ‌ర్ షోలో వెనుక‌బ‌డ‌ట‌మో ఏమో కానీ, స్నేహ అప్ప‌ట్లో స్టార్ కాలేక‌పోయింది. వ‌చ్చిన అవ‌కాశాల మేర‌కు వివిధ సినిమాల్లో న‌టించి, కొన్నేళ్ల‌కు న‌టుడు ప్ర‌స‌న్న‌ను పెళ్లి చేసుకుని, పిల్ల‌ల‌తో సెటిలైంది స్నేహ‌.

 

అయితే క్ర‌మం త‌ప్ప‌కుండా ఇండ‌స్ట్రీతో మాత్రం ట‌చ్లో ఉంటూ వ‌చ్చింది. కొన్నేళ్ల కింద‌టే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారింది. *స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి*లో ఉపేంద్ర స‌ర‌స‌న న‌టించ‌డం ద్వారా కొత్తగా కెరీర్ ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈమె వ‌య‌సు కూడా త‌క్కువేమీ కాదు. 38 యేళ్ల ఈ న‌టీమ‌ణి.. ఇప్ప‌టికీ త‌ర‌గ‌ని అందంతో క‌నిపిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో ఒక త‌మిళ సినిమాలో స్నేహ ఇప్పుడు ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తూ ఉంది! ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు చేయ‌డానికి ఎప్పుడూ రెడీగా ఉండే ధ‌నుష్ పెళ్లై, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిలవుతున్న స్నేహ‌ను త‌న సినిమాలో హీరోయిన్ ను చేశాడు. స్నేహ ధ‌నుష్ ప‌క్క‌న హీరోయిన్ ఏమిటి అంద‌రూ అవాక్క‌య్యారా కానీ ఇది నిజం.  'ప‌ట్టాస్' పేరుతో రూపొందిన ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సినిమాలో స్నేహ‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యంగ్ హీరోయిన్లు కూడా ఉంటారట‌. కానీ స్నేహ‌ది కూడా ధ‌నుష్ కు జోడీ పాత్రే అని తెలుస్తోంది.

 

మ‌రి ఒక‌వైపు టాలీవుడ్ లో, కోలీవుడ్ లో సీనియ‌ర్ హీరోలు హీరోయిన్లు దొర‌క్క‌ చాలా ఇబ్బంది ప‌డుతూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తున్న స్నేహ సీనియ‌ర్ హీరోల‌కు ఒక ఛాయిస్ గా మార‌వ‌చ్చు. కుర్ర పిల్ల‌ల‌తో గెంతులేస్తున్నారు అనే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన‌డాని క‌న్నా సీనియ‌ర్ హీరోల‌కు స్నేహ స‌రి జోడీనేమో ఒక‌సారి ద‌ర్శ‌కులు ఆలోచిస్తే బావుంట‌ది. ఇక ఇదిలా ఉంటే గ‌తంలో ఇలా కొంత మంది సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న హీరోయిన్ అంటే ముందులో ఆలోచించేది స్నేహ పేరు కానీ త‌ను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోవ‌డంతో కాజ‌ల్‌, న‌య‌న్, త్రిష‌ల‌కు ఆ ఛాన్స్ దొరికిన‌ట్ల‌నిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: