ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ పై మన దేశంతో పాటు దేశ, విదేశాల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మెగా, నందమూరి హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నటిస్తున్న విలన్ పాత్రధారుల ఫస్ట్ లుక్ ని ఇటీవల సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే మరొక రెండు రోజుల్లో న్యూ ఇయర్ ని పురస్కరించుకుని ఈ సినిమా ఫుల్ టైటిల్, 

 

అలానే ఇద్దరు హీరోలు కలిసి ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు అనే వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో రెండు రోజలుగా ప్రచారం అవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు ఈ విషయమై ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ వార్తలపై కొంత మిశ్రమ స్పందన లభిస్తోంది. అసలు ఈ సినిమా టైటిల్ ని ఎప్పుడో ప్రకటించవలసిందని, అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రకటిద్దామని ఇప్పటివరకు వెయిట్ చేసారని, అలానే టైటిల్ తో పాటు హీరోలిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ చేయనున్నారని కొందరు అంటుంటే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ వార్తలను విశ్వసించలేమని మరికొందరు అంటున్నారు. 

 

అయితే ఈ వార్తలపై కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూ, నిజానికి టోటల్ గా ప్రపంచంలోని తెలుగు వారు సహా పలు ఇతర భాషల వారు సైతం ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, అయితే న్యూ ఇయర్ సందర్భంగా వాటిని రిలీజ్ చేయాలని ఆర్ఆర్ఆర్ టీమ్ భావించివుంటే, ఈ పాటికే వారి నుండి కొద్దిపాటి సమాచారం బయటకు వచ్చేదని, కావున న్యూస్ ఇయర్ కి ఫస్ట్ లుక్ రిలీజ్ ఉండకపోవచ్చని అంటునాన్రు. దీనినిబట్టి  వాటి రిలీజ్ కు మరికొంత సమయం పట్టినా పట్టవచ్చని తెలుస్తోంది. మరి ఈ విషయమై ఆర్ఆర్ఆర్ టీమ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: