2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ సినిమా ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా.తర్వాత వరసగా సినిమాలు చేస్తూ విజయం సాధించాడు ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది.అక్కడనుంచి ఇంకా వెనక్కి చూసుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు..

 

 

తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు..తర్వాత ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. " తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషలలో భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.

 

సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. దీనితో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయింది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా స్టార్ డంను దక్కించుకున్న ప్రభాస్ ను ఈ "దశాబ్దపు ఇండియాస్ సూపర్ స్టార్" అంటూ ఫ్యాన్స్ ప్రకటించేశారు. ఈ దశాబ్ద కాలంలో ఇండియాలో అత్యధిక ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని బాలీవుడ్ స్టార్లను సైతం పక్కకు తోసేసాడు. అందుకే ప్రభాస్ ని "ఈ దశాబ్దపు ఇండియాస్ సూపర్ స్టార్ "అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తున్నారు.. ప్రస్తుతం ప్రభాస్ "జాన్" సినిమాలో నటిస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: