తెలుగు సినిమా రంగంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ అదరగొట్టే సినిమాలు చేసి స్టార్టింగ్ లో మంచి విజయాలు సాధించాడు. అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ అంటే బ్రహ్మానందం..అటువంటి సమయంలో బ్రహ్మానందాన్ని డామినేట్ చేసే విధంగా సునీల్ వరుస ఆఫర్లు దక్కించుకుని తెలుగు సినిమా రంగంలో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగాడు. ఇటువంటి తరుణంలో హీరోగా రాణించడం కోసం సునీల్ సినిమాలు స్టార్ట్ చేసి మొదటిలో విజయాలు సాధించిన తర్వాత వరుసగా ఫ్లాపులు చూడటం తో కొన్ని సంవత్సరాలు సునీల్ సినిమా రంగంలో అడపాదడపా అన్నట్టుగా కనబడేవారు. దీంతో ఫెయిల్యూర్ గా సినిమా హీరోగా అవటంతో మళ్లీ ఇప్పుడు తిరిగి కమెడియన్ ట్రాక్ ఎక్కాడు.

 

ఇటువంటి తరుణంలో మరొక ప్రయోగానికి సునీల్ రెడీ అయినట్లు..సునీల్ చేయబోయే ప్రయోగం తెలుసుకుని తెలుగు ఇండస్ట్రీ వామ్మో అంటుంది. విషయంలోకి వెళితే ఇప్పటివరకు కమెడియన్ మరియు హీరోగా రాణించిన సునీల్ రాబోయే రోజుల్లో ప్రతినాయకుడు అనగా విలన్ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్లు కొత్త ప్రయోగం చేయడానికి శ్రీకారం చుట్ట బోతున్నట్లు సమాచారం. జెర్సీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించిన నటుడు సుహాస్, మను సినిమాలో హీరోయిన్ గా నటించిన చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘కలర్ ఫోటో’ అనే సినిమా రూపొందుతోంది.

 

ఈ చిత్రాన్ని నూచాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రేమ కథలో సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తారని సినిమా యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ నాని ఇటీవల తన సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సునీల్ 'అలా వైకుంఠపురం లో' సినిమాలో కమెడియన్ గా కీలకమైన క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: