స్నేహ‌.. సౌత్ లో ఈ పేరు కి ఏ మాత్రం ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. హీరోయిన్ గా అద్భుతమైన సినిమాలు చేసింది. అంతేకాదు సౌందర్య తర్వాత మళ్ళీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ స్థాయి సక్సస్ ని పేరుని సంపాదించుకుంది. ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అంట ముందు దర్శక, నిర్మాతలకి ముందు కనిపించే పేరు స్నేహ నే అని ఖచ్చితంగా చెప్పలి. ఇక అనేక మంది స్టార్ హీరోల సినిమాల్లో న‌టించినా.. త‌ను స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది స్నేహ‌. క‌మ‌ల్ హాస‌న్, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల‌తో స్నేహ న‌టించింది. న‌టిగా కూడా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. గ్లామ‌ర్ షోలో వెనుక‌బ‌డ‌ట‌మో ఏమో కానీ, స్నేహ అప్ప‌ట్లో స్టార్ కాలేక‌పోయింది. వ‌చ్చిన అవ‌కాశాల వర‌కు మంచి మంచి సినిమాల్లో న‌టించి, కొన్నేళ్ల‌కు న‌టుడు ప్ర‌స‌న్న‌ను పెళ్లి చేసుకుని, పిల్ల‌ల‌తో సెటిలైంది. 

 

అయితే క్ర‌మం త‌ప్ప‌కుండా ఇండ‌స్ట్రీతో ట‌చ్లో ఉంటూ వ‌చ్చింది. కొన్నేళ్ల కింద‌టే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం తెరకెక్కించిన 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' సినిమాలో ఉపేంద్ర స‌ర‌స‌న న‌టించ‌డం ద్వారా కొత్తగా కెరీర్ ప్రారంభించింది. ప్ర‌స్తుతం స్నేహ వ‌య‌సు కూడా త‌క్కువేమీ కాదు. 38 యేళ్ల ఈ న‌టీమ‌ణి.. ఇప్ప‌టికీ త‌ర‌గ‌ని అందంతో క‌నిపిస్తూ ఉంటుంది.

 

ఈ క్ర‌మంలో ఒక త‌మిళ సినిమాలో స్నేహ ఇప్పుడు ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తూ ఉంది! ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు చేయ‌డానికి ఎప్పుడూ రెడీగా ఉండే ధ‌నుష్ పెళ్లై, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిలవుతున్న స్నేహ‌ను త‌న సినిమాలో హీరోయిన్ ను చేశాడు. 'ప‌ట్టాస్' పేరుతో రూపొందిన ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సినిమాలో స్నేహ‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యంగ్ హీరోయిన్లు కూడా ఉంటారట‌. కానీ స్నేహ‌ది కూడా ధ‌నుష్ కు జోడీ పాత్రే అని కోలీవుడ్ మీడియా తాజా సమాచారం.

 

మ‌రి ఒక‌వైపు టాలీవుడ్ లో.. కోలీవుడ్ లో సీనియ‌ర్ హీరోలు హీరోయిన్లు దొర‌క్క‌ చాలా ఇబ్బంది ప‌డుతూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తున్న స్నేహ సీనియ‌ర్ హీరోల‌కు ఒక ఛాయిస్ గా మార‌వ‌చ్చు. కుర్ర హీరోయిన్ లతో కులుకుతున్న సీనియర్ హీరోలు అనే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన‌డాని క‌న్నా అదే సీనియ‌ర్ హీరోల‌కు స్నేహ స‌రి జోడీ అన్న టాక్ మొదలైంది. మొత్తానికి స్నేహ హీరోయిన్ గా రీ ఎంట్రీ చాలామంది హీరోయిన్స్ కి ఎసరు పెట్టడం ఖాయమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: