ఇది అమ్మాయిల కి పడుతున్న పిచ్చా లేకా అమాయకత్వమా అర్థం కావడం లేదు. ఆఫీస్ లో, ఫేస్ బుక్ లో, ఇంటి చుట్టు పక్కల ..ఇలా ఎక్కడపడితే అక్క అబ్బాయిలతో పరిచయం ఏర్పరుచుకొని వాళ్ళ తో ఛాటింగ్, అర్ధ రాత్రి వరకు అర్ధం పర్ధం లేని ఫోన్ కాల్స్ తో క్లోజ్ అయిపోతున్నారు. వాళ్ళు చెప్పింది నమ్మి మోసపోతున్నారు. ఇది చాలామంది అమ్మాయిల్లో సహజంగా తరచూ జరుగుతోంది. ఇది అట్రాక్షనా లేక .. అవతలి వాడు మైండ్ సెట్ చేస్తాడా.. అని అందరు షాక్ లో ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి మరో సంఘటన బాలిక కుటుంబాని కలచి వేస్తోంది. పబ్‌జీ కమ్యూనిటీ గేమ్‌లో పరిచయమైన ఓ బాలికను లైంగికంగా వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక వద్ద నుంచి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించిన అతను.. వాటితో ఆ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తున్నాడు. 

 

నెల రోజులుగా అతని వేధింపులు భరించిన బాలిక.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులతో అసలు విషయం చెప్పింది. తల్లిదండ్రులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సల్మాన్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల పబ్‌జీ కమ్యూనిటీ గేమ్‌లో 14 ఏళ్ల బాలికతో పరిచయమైంది. ఆమె సెల్‌ఫోన్ నంబర్ తీసుకుని తరుచూ వాట్సాప్‌లో చాట్ చేసేవాడు. అలా ఆమె వ్యక్తిగత ఫోటోలు,వీడియోలు కూడా సంపాదించుకున్నాడు. 

 

ఆతర్వాత తనతో గడపాలని.. లేదంటే వాటిని బయటపెడుతానని బెదిరించడం మొదలుపెట్టాడు. నెల రోజుల పాటు అతని వేధింపులు భరించిన బాలిక.. వేధింపులు తీవ్రం కావడంతో తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ మొబైల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తు చేశారురు. ఆ దర్యాప్తులో అమ్మాయి మెసేజెస్ మాత్రమే ఉండేలా జాగ్రత్త పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఇక గతంలోనూ సల్మాన్ మరికొందరు అమ్మాయిలను ఇలాగే బ్లాక్‌మెయిల్ చేసినట్టు అనుమానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: