టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాలుగేళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, అలానే రెండేళ్ల క్రితం బాహుబలి 2 సినిమాలు రెండూ కూడా ఒక దానిని మించి మరొకటి ఎంతటి విజయాలు అందుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే. ఆర్కా మీడియా బ్యానర్ పై అత్యంత భారీ ఖర్చుతో నిర్మితం అయిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఆ రెండు సినిమాలు కూడా అంతటి అత్యద్భుత విజయాలు అందుకుని హీరో ప్రభాస్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు, మార్కెట్ ని తెచ్చిపెట్టాయి. ఇక అదే ఊపులో ఇటీవల ఆయన నటించిన సాహో సినిమాకు, నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారు దాదాపుగా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రిలీజ్ కు ముందు ఎన్నో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా

 

రిలీజ్ తరువాత వాటిని అందుకోవడంలో చాలావరకు విఫలం అయింది. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు యువ దర్శకుడు సుజీత్ నటించాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా థియేట్రికల్ రైట్స్, డిజిటల్, ఆడియో రైట్స్ ని భారీ ధరలకు అమ్మిన నిర్మాతలు, శాటిలైట్ హక్కులు మాత్రం ఎంతమంది టివి ఛానల్స్ వారు వచ్చి అడిగినా సరే, అమ్మకుండా సినిమా రిలీజ్ తరువాత అమ్ముదాం అని భావించి తమ వద్దనే రైట్స్ ఉంచుకున్నారట. అయితే అనూహ్యంగా రిలీజ్ తరువాత సినిమా పరాజయం పాలవడంతో తలలు పట్టుకున్న నిర్మాతలు, ఇప్పటికీ కూడా అవి కొనుగోలు చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

నిజానికి ఈ సినిమాని ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ఆల్మోస్ట్ చాలా మంది చూసేశారని, ఇకపై టివి ఛానల్ లో ప్రదర్శించినా రేటింగ్స్ ఆశించిన రేంజ్ లో రాకపోవచ్చని భావించి టివి ఛానల్స్ వారు ప్రస్తుతం రైట్స్ కొనడానికి ముందుకు రావడం లేదని వినికిడి. రైట్స్ ని భారీగా తగ్గించి అమ్ముదాం అని భావించినప్పటికీ కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇకపై తమ తదుపరి సినిమాల విషయంలో ఇటువంటి తప్పిదాలు చేయకూడదని ఫిక్స్ అయ్యారట నిర్మాతలు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మద్యంలో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: