ప్రస్తుతం టాలీవుడ్ సినిమా తెర పై అత్యంత భారీ ఖర్చుతో , అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీపై మన దేశ సినిమా ప్రేక్షకులతో పాటు విదేశాల్లో ఉన్న వారిలో కూడా భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి రెండు భాగాలూ కూడా అద్భుత విజయాన్ని అందుకుని, ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్ ని కొల్లగొట్టడంతో, రాజమౌళి తదుపరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇంత భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. హిస్టారికల్  బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్  టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఆలియా భట్

 

ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లను నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న ప్రకారం, ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని అంటున్నారు. ఎందుకంటే, ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ముగియనుందని, టోటల్ గా షూటింగ్ పూర్తి అయిన తరువాతనే సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టాలని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావిస్తోందట. 

 

అందుకే ఇప్పటివరకు కూడా సినిమా ఫస్ట్ లుక్ అప్ డేట్స్ పై ఎటువంటి అధికారిక సమాచారం లేదని అంటున్నారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం ప్రక్కన పెడితే, మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ లవర్స్ అందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూపులు చూస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. కాగా సినిమా ఫస్ట్ లుక్ అప్ డేట్ పై ఆర్ఆర్ఆర్ టీమ్ ఇకనైనా స్పందిస్తే బాగుటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: