టాలీవుడ్ దిగ్గజ నటులైన సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ కూడా గత ఏడాది సమ్మర్ లో భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాలతో పోటీ పడ్డారు. అయితే అప్పట్లో రెండు సినిమాల నిర్మాతలు కొంత సయోధ్యకు వచ్చి, రెండు సినిమాలకు పదిహేను రోజుల గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళి ఏడాదిన్నర తరువాత ఈ ఇద్దరు నటుల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు రిలీజ్  అవుతుండగా,12న అల్లు అర్జున్ నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమా రిలీజ్ అవుతోంది. 

 

ఇక ఈ రెండు సినిమాల సాంగ్స్, టీజర్ రిలీజ్ లు అలానే ప్రమోషన్స్ విషయమై ఇప్పటికే పలు విధాలుగా పోటీ జరుగుతోంది. ఆ విషయాలు అటుంచితే, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ రెండు సినిమాలకు ఒక విషయంలో మాత్రం భారీగా దెబ్బ పడనుందని తెలుస్తోంది. అదేమిటంటే, ఈ రెండు సినిమాలు కూడా రెండున్నర గంటలకు పైగా నిడివిని కలిగి ఉండడమేనట. సరిలేరు నీకెవ్వరు సినిమా ఓవర్ ఆల్ రన్ టైం 2 గంటల 50 నిముషాలు కాగా, అలవైకుంఠురములో సినిమా రన్ టైం 2 గంటల 45 నిమిషాలని టాక్. వాస్తవానికి ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాల రన్ టైం చాలా వరకు తక్కువగా ఉంటోందని, 

 

మరి ఇటువంటి పరిస్థితుల్లో రెండున్నర గంటలకు పైగా సాగనున్న ఈ సినిమాలు ఎంతవరకు ఎంతవరకు ప్రేక్షకుడి మెప్పుతో సక్సెస్ ని సాధిస్తాయి అనే దానిపై కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనాలు కనుక ఉంటె, సినిమా యొక్క రన్ టైం తో సంబంధం ఉండదని, ఇటీవల రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా దాదాపుగా 3 గంటల నిడివి ఉన్నప్పటికీ సూపర్ హిట్ కాలేదా అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా రెండున్నర గంటలకు పైగా సాగనున్నాయంటూ ప్రస్తతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై నిజానిజాలు వెల్లడి కావలసి ఉంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: