సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కష్టపడుతుంటారు. ఇప్పుడంతే షార్ట్ ఫిలిమ్స్ అనీ రకరకాల ఫ్లాట్ ఫామ్ లు తమని తాము నిరూపించుకోవడానికి వచ్చాయి. కానీ ఒకప్పుడు అవేవీ లేవు. అలాంటప్పుడు దర్శకుడు కావాలని కలలు కన్న వారు ఖచ్చితంగా అసిస్టెంట్ గా చేయాల్సిందే. అయితే అలా అసిస్టెంట్ గా చేసినపుడు ఎన్నో అవమనాలు పడ్డ దర్శకులు చాలా మంది ఉన్నారు.

 

అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక దర్శకుడు కావడానికి కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇండస్ట్రీకి రాక ముందు చాలా సాధారణ జీవితం గడిపిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో డైరెక్టర్ మారుతి ఒకరు. మారుతి చాలా సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చాడు. మారుతి తండ్రి రోడ్డు మీద తోపుడు బండిలో అరటిపళ్లు అమ్మేవారట. తండ్రికి సాయంగా మారుతి కూడా అప్పుడప్పుడూ ఆ పని చేసేవాడట.

 

అంతే గాక అతను బైకులకు స్టిక్కరింగ్ చేసే పని కూడా చేశాడు కొన్నాళ్లు. అలాగే  ఒక ఆఫీసులో బాయ్‌గా కూడా పని చేశాడట. సాధారణంగా పెద్ద దర్శకులు అయ్యాక  ఇలాంటి పనులు చేశామని చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ మారుతి అందుకు పూర్తిగా భిన్నం. తన మూలాల్ని అతనెప్పుడూ మరిచిపోలేదు. తన గతం గురించి ఎప్పుడూ దాచుకోలేదు. గతంలోనే దీని గురించి చూచాయిగా చెప్పిన అతను.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చాడు.

 

తన గతం తల్చుకుంటే తనకెప్పుడూ గర్వంగా ఉంటుందట. ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చామనే గర్వంగా అనిపిస్తుందట. ఒకసారి ప్రతి రోజూ పండగే సెట్ లో అరటి పళ్ళ బండి పెట్టారట. అది చూసి చాలా నోస్టాల్జిక్ గా ఫీల్ అయ్యాడట. ఆ బండితో ఫోటో దిగి సోషల్ మీడియాలో చిన్ననాటి జ్ఞాపకాలని పోస్ట్ కూడా పెట్టాడట. ఎంతైనా తమ సాధారణ గతం గురించి చెప్పడం నిజంగా గొప్ప విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: