కమెడియన్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి హీరోగా కొన్ని మంచి మంచి చిత్రాలు చేసి ప్రస్తుతం తన ఫేమ్ కోల్పోయిన నటుడు సునీల్ మరికొద్ది రోజుల్లో మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఒకప్పుడు సునీల్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదెమో! ప్రతీ సినిమాలోనీ కనిపించేవాడు. సునీల్ పేల్చే పంచులకి థియేటర్లో నవ్వని వాళ్ళుండరు. అలా నవ్వించిన సునీల్ సడెన్ గా హీరో అయిపోయాడు.

 

అది కూడ మాస్ హీరోగా ప్రయత్నించే సరికి జనాలకి ఎక్కలేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోగా మలుపుతిరిగి మళ్లీ విలన్ గా రావడం నిజంగా ఆశ్చర్యకరం. హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ సాయి రాజేష్ గారి తదుపరి చిత్రం కలర్ ఫోటోలో సునీల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరో పరిచయం కాబోతున్నాడు. 

 

మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఎన్నో లఘు చిత్రాల్లో నటించి ఆ తర్వాత మరెన్నో తెలుగు సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మేరకు ఈ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 

 

నేచురల్ స్టార్ నాని ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ని రివీల్ చేశాడు. సందీప్ రాజ్ గతంలో చాలా లఘుచిత్రాలకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల మత్తు వదలరా చిత్రానికి సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: