ప్రభాస్ ఎలాంటి హడావుడి లేకుండానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన చేసిన మొదటి సినిమాకు ఇప్పటికి పోల్చుకుంటే నటుడిగా ఎంత ఎదిగాడో అర్ధం అవుతుంది. ఇకపోతే  ప్రభాస్ ఓ చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి. తరువాత మీడియం రేంజ్ హీరోగా. తరువాత స్టార్ హీరోగానూ.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.. తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఈ 17 ఏళ్ళలో ప్రభాస్ చేసిన సినిమాలు కేవలం 19 మాత్రమే అంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే చేసిన అతి తక్కువ సినిమాలతోనే ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు.

 

 

ఇకపోతే ఈ 17 ఏళ్ళ కెరీయర్‌లో ప్రభాస్ చేసిన సినిమాలు 19 అయితే..  ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా 10 వరకూ ఉన్నాయంటే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కాని ఇది నిజం అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కాగా మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి. ఇంతకు ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.. ప్రభాస్ రిజక్ట్ చేసిన మొదటి సినిమా ఒక్కడు. మహేష్ కెరీర్ కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

 

 

అయితే మొదట ఈ చిత్రం ప్రభాస్ చేయాల్సిందట. నిర్మాత యం.ఎస్.రాజు దర్శకుడు గుణశేఖర్ ను తీసుకుని ప్రభాస్, కృష్ణంరాజు లను కలిసి కథ వినిపించారట. అయితే కబడ్డీ గేమ్.. అంటున్నారు స్క్రిప్ట్ కూడా కూడా కొంచెం రిస్క్ గా అనిపించడంతో రిజెక్ట్ చేసారని తెలుస్తుంది. ఇక రెండో సినిమా దిల్.. ‘ఈశ్వర్’ నుండీ వినాయక్, దిల్ రాజు లతో ప్రభాస్ కు మంచి స్నేహం ఉంది.అందుకే మొదట ఈ స్టోరీ ప్రభాస్ కే వినిపించాడట వినాయక్. కానీ అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేసాడట.

 

 

ఇలాగే ‘సింహాద్రి’ కథ మొదట ప్రభాస్ కే చెప్పాడు రాజమౌళి. కానీ అప్పటికే క్లాస్  సినిమాని హ్యాండిల్ చేసిన ఈయన ఈ మాస్ సబ్జెక్టు ను హ్యాండిల్ చేయగలడా అనే అనుమానంతో ప్రభాస్ ఈ కథను రిజెక్ట్ చేసాడట. అలాగే  ఆర్య కథని కూడా సుకుమార్, దిల్ రాజు, మొదట ప్రభాస్ కి వినిపించారట. కాని ప్రభాస్ రిజెక్ట్ చేసాడట. ఇవే కాకుండా బృందావనం, నాయక్ , కిక్, ఊసరవెల్లి, డాన్ శీను, జిల్ వంటి సినిమాలు కూడా మొదట ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయట. కాని కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలు వదులుకున్నాడట.. చూసారుగా ఇవండి ప్రభాస్ మిస్ చేసుకున్న సినిమాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: