వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఎన్నో ఆశలు పెట్టుకున్న "చాణక్య" సినిమా కూడా ఫ్లాప్ కావడంతీ ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యమ్తో ఉన్నాడు. గోపీ చంద్ కి లౌక్యం సినిమా తర్వాత ఇప్పటి వరకు హిట్ రాలేదు. వరుసగా సినిమాలు చేస్తున్న ఏది కలిసి రావట్లేదు. ఈ నేపథ్యంలో తనకి అచ్చొచ్చిన డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.

 

సంపత్ నంది దర్శకత్వంలో గతంలో గొపీచంద్ గౌతమ్ నంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా ఫర్వాలేదనిపించింది. మిగతా సినిమాలతో పోల్చితే ఈ సినిమా కొద్దిగా బెటర్ అనిపించింది. అయితే ప్రస్తుతం తెరకెక్కే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట.
తెలుగులో స్పోర్ట్స్ బేస్ మీద వచ్చే సినిమాలు చాలా తక్కువ. కంటెంట్ గనక స్ట్రాంగ్ గా ఉంటే సినిమా ప్రేక్షకులై ఈజీగా కనెక్ట్ అవుతుంది.

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గోపీచంద్ పై కొన్ని కామెడీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సపంత్ నంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ కామెడీ సీక్వెన్సెస్ లో గోపీచంద్ తో పాటు తమన్నా, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కూడా షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

 


మరి స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమానైనా గోపీచంద్ కి విజయాన్నందిస్తుందా లేదా చూడాలి. గోపీచంద్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడట .ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకంగా ఉన్నారట. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: