ప్రస్థుతం వరస హిట్స్ తో దూసుకు పోతున్న వరుణ్ తేజ్ కు అల్లు బాబి రూపంలో తీవ్ర కష్టాలు వచ్చాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా జోక్స్ పడుతున్నాయి. ‘గద్దలకొండ గణేష్’ తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బాక్సింగ్ నేపధ్యంలో తీస్తున్న విషయం తెలిసిందే. 

యంగ్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తీస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీ ద్వారా అల్లు బాబి నిర్మాతగా ఎంటర్ అవుతున్నాడు. దీనితో తాను తీస్తున్న మొదటి సినిమా సూపర్ సక్సస్ కావాలని ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ బాబి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయి ప్రతి విషయంలోనూ సహజత్వం ఆశిస్తున్న నేపధ్యంలో ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ సహజత్వం కోసం హాలీవుడ్ కు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టోవల్‌ను తీసుకు వచ్చాడు. గతంలో ఈయన సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్' తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశాడు.

వాస్తవానికి గతంలో అమెరికా వెళ్ళి మరీ వరుణ్ తేజ్ లార్నెల్ దగ్గరే శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు అల్లు బాబీ కోరిక పై ఆయన హైదరాబాద్ వచ్చి బాక్సింగ్స్ సీన్స్ కంపోజ్ చేయడమే కాకుండా రోజుకు గంటల తరబడి వరుణ్ తేజ్ కి మరింత మెరుగైన శిక్షణ ఇస్తున్నట్లు టాక్. దీనితో ఒళ్ళు హూనం అయిపోతున్న వరుణ్ తేజ్ తాను ఎరక్కపోయి అల్లు బాబి దగ్గర చిక్కుకుపోయాను అంటూ వరుణ్ తేజ్ తన మెగా ఫ్యామిలీ కజిన్స్ దగ్గర జోక్ చేస్తున్నట్లు టాక్. ఈమధ్య కాలంలో బాక్సింగ్ నేపధ్యంలో వచ్చిన చాల సినిమాలు సక్సస్ అవుతున్నాయి. దీనితో ఈ మూవీలోని కథ గురించి మాత్రమే కాకుండా సీన్స్ సహజత్వం గురించి కూడ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: