బెంగుళూరు బ్యూటీగా ఇండస్ట్రీకి పరిచయం అయిన స్నేహ గతంలో అనేకమంది స్టార్ హీరోలతో నటించింది. అయితే ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. వాస్తవానికి లుక్ పరంగా ఆమెకు మంచి ప్రశంసలు ఉన్నా గ్లామర్ షోలో ఆమె వెనకపడటంతో ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది అన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

క‌మ‌ల హాస‌న్ నాగార్జున‌ బాల‌కృష్ణ వెంకటేష్ వంటి ఎందరో హీరోలతో నటించిన స్నేహ పెళ్ళిచేసుకున్న తరువాత సినిమాలకు దూరం అవ్వాలని ప్రయత్నించింది. అయితే ఆమె భర్త కన్నడ హీరో ప్రసన్న పెద్దగా రాణించలేకపోవడంతో ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఆరిస్టుగా మారి అమ్మ వదిన పాత్రలను పోషిస్తోంది.  

‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ మూవీలో ఉపేంద్ర స‌ర‌స‌న న‌టించ‌డం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. వాస్తవానికి ఆమెకు 38 ఏళ్ల వయసు ఉన్నా ఆమె గ్లామర్ ఏమి తగ్గక పోవడంతో ఒక తమిళ దర్శకుడుకి ఒక ఆలోచన వచ్చింది. ఈ క్ర‌మంలో ఆమె ఇప్పుడు ధ‌నుష్ స‌ర‌స‌న సరసన హీరోయిన్ గా న‌టిస్తూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది.  ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాలకు చిరునామాగా ఉండే ధనుష్ ప్రస్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొనసాగిస్తున్న స్నేహ‌ను త‌న సినిమాలో హీరోయిన్ గా చేశాడు. 

'ప‌ట్టాస్' పేరుతో రూపొందిన ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలో స్నేహ‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యంగ్ హీరోయిన్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా సక్సస్ అయితే ప్రస్తుతం హీరోయిన్స్ దొరకక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ సీనియర్ హీరోల సమస్యలు కొంత వరకు తీరిపోతాయి అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.  అంతేకాదు రానున్న రోజులలో స్నేహ సీనియ‌ర్ హీరోల‌కు ఒక ఛాయిస్ గా మారే అవకాసం ఉంటుంది అని అంటున్నారు. మరి సీనియర్ హీరోల ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: