‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనంతరం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌, ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.  సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌, టీజర్‌తో బన్ని, త్రివిక్రమ్‌లు హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈ మెగా హీరో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

అదేనంది.. సుకుమార్ దర్శకత్వంలో బ‌న్నీ 20వ సినిమా చేయనున్నాడు. ఇక‌ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. నిజానికి అల్లు అర్జున్‌కు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ త‌ర్వాత ఆర్య 2 వ‌చ్చినా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటిదాకా ప్రాజెక్టు ప్రారంభం కాలేదు.

 

అందుకు కారణం కథ విషయంలో బన్ని కాంప్రమైజ్ కాకపోవటమే అని తెలుస్తోంది. శేషాచలం ఫారెస్ట్ లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆ కథ రెడీ చేసారు. అయితే ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని  ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో జనవరి 17 తారీకు నుండి ప్రారంభించటానికి రంగం సిద్దం చేశార‌ట‌. అలాగే ఈ సినిమా కోసం శేషాచలం ఫారెస్ట్ లో షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే అటవి శాఖ వారు నుంచి ఫర్మిషన్ రాలేదు. దీంతో సుకుమార్‌ వెంటనే యాక్షన్ ప్లాన్ మార్చి ఈ సినిమాని బ్యాంకాక్ అడవుల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక‌ ఆ రోజు నుంచే అల్లు అర్జున్ జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బన్నీ పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్లో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ.. `లారీ డ్రైవర్‌` గా బాల‌య్య సూప‌ర్ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎన్ని లారీడ్రైవ‌ర్ సినిమాలు వ‌చ్చినా వాటన్నింటికంటే ఈ సినిమా పేరు ఇప్ప‌ట‌కీ పాపుల‌ర్ అయ్యింది. మళ్లీ బ‌న్నీ ఇప్పుడు అదే లారీ డ్రైవ‌ర్‌గా చేస్తున్నాడు. మ‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ హిట్ కొడ‌తాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: