జబర్దస్త్ షోతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ హీరోగా చేసిన సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. బుల్లితెర మీద బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ హీరోగా కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ గా సుధీర్ తన డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో మెప్పించాడు. సినిమాలో సుధీర్ కష్టం తెర మీద కనిపిస్తుందని అంటున్నారు.

 

సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొడుతుంది. హీరోగా సుధీర్ తన వరకు బాగానే చేసినా కథ, కథనాలు రొటీన్ గా ఉండటంతో సినిమాను కాపాడలేకపోయాయని తెలుస్తుంది. ఇక సుధీర్ సినిమా గురించి రష్మి కామెంట్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. సుధీర్ సినిమా సక్సెస్ అయినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పింది రష్మి గౌతం.  

 

ఇక సుధీర్ హీరోగా చేస్తున్నప్పుడు హీరోయిన్ గా మీరు ఎందుకు చేయలేదని యాంకర్ అడిగింది. అయితే మంచి కథ దొరికితే సుధీర్ తో నటించేందుకు రెడీ అన్నది రష్మి. ఇక సుధీర్ చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో మీకు బాగా నచ్చిన అంశాలేంటి అంటే సుధీర్ మీకు కొత్త కావొచ్చు కాని నాకు కాదు ఏడేళ్లుగా సుధీర్ లోని టాలెంట్ అంతా నాకు తెలుసు. సుధీర్ నవరసాలు నాకు చూపించాడని అన్నారు రష్మి.

 

సుధీర్ రష్మి జోడీకి బుల్లితెర ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ ఉంది. సుధీర్ హీరోగా రష్మి హీరోయిన్ గా చేస్తే మాత్రం ఆ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరు వారి కాంబో సినిమా కథల వేటలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ లో తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెట్టిన సుధీర్ హీరోగా నిలబడతాడో లేదో చూడాలి. ఏది చేసినా జబర్దస్త్ మాత్రం వదిలేదు లేదని అంటున్నాడు సుదీర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: